
చెన్నై: హైదరాబాద్ స్టార్ సాకేత్ మైనేని చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. భారత టాప్ ర్యాంక్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ ముకుంద్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 11వ సీడ్ సాకేత్ 3–6, 6–7 (3/7)తో ఐదో సీడ్ డేవిడొవిచ్ ఫొకినా (స్పెయిన్) చేతిలో పరాజయం చవిచూడగా... అన్‌సీడెడ్ ముకుంద్ 6–3, 6–4తో మూడో సీడ్ మొహమద్ సఫ్వాత్ (ఈజిప్టు)కు షాకిచ్చాడు. టాప్ సీడ్ ప్రజ్నేశ్ 6–4, 6–2తో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేను ఇంటిదారి పట్టించాడు. నేడు జరిగే క్వార్టర్స్‌లో ప్రజ్నేశ్... ఏడో సీడ్ జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో, శశికుమార్ ముకుంద్... బ్రిడన్ క్లెయిన్ (బ్రిటన్)తో తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment