హామిల్టన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తన ప్రత్యర్థి ముందు 369 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (134 బంతుల్లో 102 నాటౌట్; 16 ఫోర్లు) సూపర్ సెంచరీ సహాయంతో కివీస్ తమ రెండో ఇన్నింగ్స్ లో 85.3 ఓవర్లలో 5 వికెట్లకు 313 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత పాక్ తమ రెండోఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఒక్క పరుగు చేసింది.