
పాకిస్తాన్ 216 ఆలౌట్
హామిల్టన్: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్ లో 216 పరుగుల వద్ద ఆలౌటైంది. 76/5 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ నిలకడను ప్రదర్శించింది. ప్రధానంగా ఓవర్ నైట్ ఆటగాళ్లు బాబర్ అజమ్(90 నాటౌట్;196 బంతుల్లో10 ఫోర్లు), సర్ఫరాజ్ అహ్మద్(41)లు పాక్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.ఈ జోడి ఆరో వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో పాక్ తేరుకుంది. ఆ తరువాత సొహైల్ ఖాన్(37) మోస్తరుగా రాణించడంతో పాక్ రెండొందల మార్కును దాటకల్గింది.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ ఆరు వికెట్లతో పాక్ జట్టును కట్టడి చేశాడు. మరొకవైపు వాగ్నర్ మూడు వికెట్లు సాధించగా,గ్రాండ్ హోమ్కు వికెట్ దక్కింది. ఆ తరువాత న్యూజిలాండ్ ఒక బంతిని మాత్రమే ఎదుర్కొన్న తరువాత మూడో రోజు ఆట ముగిసింది.