పాక్‌కు ఊరట గెలుపు | Pakistan beat Bangladesh by 94 runs at Cricket World Cup 2019 | Sakshi
Sakshi News home page

పాక్‌కు ఊరట గెలుపు

Published Sat, Jul 6 2019 3:13 AM | Last Updated on Sat, Jul 6 2019 3:13 AM

Pakistan beat Bangladesh by 94 runs at Cricket World Cup 2019 - Sakshi

లండన్‌: ప్రపంచ కప్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల ఆట ముగిసింది. శుక్రవారం జరిగిన నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో పాక్‌ 94 పరుగులతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (100 బంతుల్లో 100; 7 ఫోర్లు) సెంచరీ సాధించాడు. బాబర్‌ ఆజమ్‌ (98 బంతుల్లో 96; 11 ఫోర్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. పేసర్‌ ముస్తఫిజుర్‌ (5/75) టోర్నీలో రెండోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు.

అద్భుత ఫామ్‌ కొనసాగిస్తూ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (77 బంతుల్లో 64; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించినా ఇతరుల నుంచి సహకారం కరవవడంతో ఛేదనలో బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. ఈ కప్‌లో ఉత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేస్తూ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, షాహీన్‌ అఫ్రిది (6/35) ప్రత్యర్థి వెన్నువిరిచాడు. మొత్తం 9 లీగ్‌ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పాకిస్తాన్‌ 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా కివీస్‌కు సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement