కరాచీ:ఇటీవల కాలంలో పాకిస్తాన్ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు తరచు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్ ల దగ్గర్నుంచీ, దేశీయ లీగ్ ల వరకూ పాక్ లో ఏదొక చోటు బుకీలు క్రికెటర్లకు గాలం వేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా పాక్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఒక బుకీ సంప్రదించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూఏఈలో శ్రీలంకతో వన్డే సిరీస్ లో భాగంగా దుబాయ్ లోని ఒక హోటల్ ల్లో సర్పరాజ్ ను బుకీ కలిసిన విషయాన్ని పీసీబీ వర్గాలు ధృవీకరించాయి. అయితే సదరు బుకీ చేసిన ఆఫర్ ను సర్ఫరాజ్ తిరస్కరించడమే కాకుండా అక్కడ ఉన్న అవినీతి నిరోధక అధికారులు వెంటనే సమాచారం అందించినట్లు పీసీబీ సీనియర్ అధికారి తెలిపారు.
'సర్ఫరాజ్ ను బుకీ సంప్రదించాడు. ఈ విషయాన్ని వెంటనే తెలియజేయడంతో అవినీతి నిరోధక అధికారులు అప్రమత్తమయ్యారు. గేమ్ ను ఫిక్సింగ్ బారిన పడకుండా చేయాలంటే సర్ఫరాజ్ ను ఉదాహరణగా తీసుకుని పాక్ క్రికెటర్లు ముందుకు సాగాలి. ఒక ఆటగాడిగా, కెప్టెన్ గా సర్ఫరాజ్ గౌరవప్రదంగా వ్యవహరించాడు' అని పీసీబీ అధికారి పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా షర్జిల్ ఖాన్, ఖలిద్ లలిఫ్ లను పై పీసీబీ నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో వారు ఫిక్సింగ్ కు పాల్పడి క్రికెట్ కు దూరమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment