టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్
ఢిల్లీ: టీ20 మహిళల ప్రపంచకప్లో భాగంగా శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సనా మిర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్ది పిచ్లో మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదని, అందుకే ఫీల్డింగ్ తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. అయితే భారత జట్టులోని బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్నారని, అది తమకు కలిసొచ్చే అంశమని భారత కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించింది. పాకిస్థాన్ జట్టు టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది.
జట్ల వివరాలు...
ఇండియా
మిథాలి రాజ్ రాజ్ (కెప్టెన్), ఝులన్ గోస్వామి, హర్మన్ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, స్మృతీ మందన, శిఖా పాండే, అనుజ పాటిల్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, వనితా, సుష్మా వర్మ (వికెట్ కీపర్)
పాకిస్థాన్
సన మీర్ (కెప్టెన్), అనమ్ అమిన్, అస్మవియా ఇక్బాల్, బిస్మా మరూఫ్, ఇరామ్ జా, మౌనిబా ఆలీ, మియాన్ ఖాన్, నిదా ఖాన్, సదియా యూసుఫ్, సిద్ర అమిన్, సిద్ర నవాజ్ (వికెట్ కీపర్)