T twenty
-
కోహ్లీ, రోహిత్ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?
-
అంతర్జాతీయ క్రికెట్లో 100వ టీ ట్వంటీ ఆడనున్న విరాట్
-
సెలెక్షన్స్‌కు అందుబాటులో ఉన్నా: మిథాలీ
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా జట్టుతో స్వదేశంలో వచ్చే నెలలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని భారత సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే టి20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిథాలీ రాజ్‌ను టి20 జట్టులోకి ఎంపిక చేస్తారో లేదో అనుమానంగా ఉంది. జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 5న సెలెక్టర్లు సమావేశం కానున్నారు. 36 ఏళ్ల మిథాలీ 2021 వన్డే వరల్డ్ కప్‌లో ఆడతానని చెప్పినా... టి20 ఫార్మాట్లో మాత్రం ఆమెను జట్టులో కొనసాగించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ‘దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌కు నేను అందుబాటులో ఉన్నాను. అయితే వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ గురించి ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతమైతే ఒక్కో సిరీస్‌పైనే దృష్టి పెట్టాను’ అని మిథాలీ తెలిపింది. ‘మిథాలీ గొప్ప క్రికెటర్. కానీ టి20 కెరీర్‌పై ఆమె తొందరగానే ఓ నిర్ణయం తీసుకోవాలి. టి20 వరల్డ్ కప్ మరో ఆరు నెలల్లోనే ఉంది. ఈలోపు కొంతమంది యువ క్రీడాకారిణులకు అవకాశం ఇవ్వాలి. మిథాలీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి’ అని బీసీసీఐ అధికారొకరు తెలిపారు. -
మ్యాచ్ ఓడాక వారి ముఖాలు ఎలా ఉన్నాయో..!
క్రికెట్ అంటే భారతీయులకు ఎంత పిచ్చో వేరే చెప్పనక్కర్లేదు. మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఎన్ని తిడతారో.. గెలిచినప్పుడు అంతగా పొగిడేస్తారు. ఇంకొందరైతే జరగబోయే మ్యాచ్ గురించి ముందే రకరకాల ఊహల్లో తేలిపోతుంటారు. అలాంటి ఊహలకు ప్రాణం పోసింది తాజాగా పొట్టి ప్రపంచ కప్. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టీ ట్వంటీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో భారత్ పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌కన్నా ముందే కొందరు భారతీయ క్రికెట్ అభిమానులు ఓ వినూత్న వీడియోను రూపొందించి యూట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియోలో చూపించిన ప్రకారం.. ఇండియా జెర్సీ వేసుకున్న వ్యక్తి దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా గోడవైపు తిరిగి నిల్చోగా అతడి వెనుక వెస్టిండీస్ జెర్సీ వేసుకున్న వ్యక్తి వామ్మో ఎలాగైనా ఇండియా చేతిలో పడొద్దని పారిపోతుంటాడు. తొలుత ఎంతో వేగంగా పరుగెత్తగా బంగ్లాదేశ్ జెర్సీ వేసుకున్న వ్యక్తి వెస్టండీస్ వ్యక్తికి సైకిల్ ఇస్తాడు.. కొద్ది దూరంగా వెళ్లగానే.. ఆస్ట్రేలియా జెర్సీతో ఉన్న వ్యక్తి వచ్చి బైక్ పై ఎక్కించుకుంటాడు. మరి కొద్ది దూరం వెళ్లగానే పాకిస్థాన్ జెర్సీతో ఉన్న వ్యక్తి కారులో ఎక్కించి అతడికి డబ్బు, సెల్ ఫోన్, ఇతర అవసరాలు అందించి పంపిస్తాడు. హమ్మయ్య ఏదో ఒకలాగా ఇండియా నుంచి తప్పించుకున్నాను అనుకొని తిరువనంతపురంలోని ఓ పాతబడిన ఇంట్లో కూర్చోని సిగరెట్ తాగేందుకు అగ్గిపుల్ల గీస్తుండగా.. అది అంటుకోదు. అప్పుడు కోహ్లీ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి లైటర్ ఇస్తాడు. అంతే.. వెస్టిండీస్ జెర్సీతో ఉన్న వ్యక్తి అవాక్కవుతాడు. ఆ తర్వాత 'నువ్వు ఎక్కడికైనా పారిపోవచ్చు.. కానీ దాచుకోలేవు' ఇట్లు కోహ్లీ అంటే ఒక వాక్యం రావడంతో వీడియో అయిపోతుంది. అంటే దీని ప్రధాన ఉద్దేశం.. పొట్టి క్రికెట్ లో అన్ని టీంలను ఓడిస్తూ వచ్చిన టీమిండియా చేతిలో ఇప్పుడు వెస్టిండీస్ చిక్కిందని, దానిని కూడా ఇండియా ఎలాగో ఓడిస్తుందని, అంతకంటే ముందే ఇండియాకు కనిపించకుండా దాస్తే బాగుంటుందని ఇతర దేశాల అభిప్రాయం అన్నట్లుగా వీడియో తయారు చేశారు. పాపం ఎంతో కష్టపడి ఈ వీడియో రూపొందిచినవారి ముఖాలు వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓడాకా ఎలా ఉన్నాయో ఊహించుకోండి. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్
ఢిల్లీ: టీ20 మహిళల ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సనా మిర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్ది పిచ్‌లో మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదని, అందుకే ఫీల్డింగ్ తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. అయితే భారత జట్టులోని బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉన్నారని, అది తమకు కలిసొచ్చే అంశమని భారత కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించింది. పాకిస్థాన్ జట్టు టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది. జట్ల వివరాలు... ఇండియా మిథాలి రాజ్ రాజ్ (కెప్టెన్), ఝులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, స్మృతీ మందన, శిఖా పాండే, అనుజ పాటిల్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, వనితా, సుష్మా వర్మ (వికెట్ కీపర్) పాకిస్థాన్ సన మీర్ (కెప్టెన్), అనమ్ అమిన్, అస్మవియా ఇక్బాల్, బిస్మా మరూఫ్, ఇరామ్ జా, మౌనిబా ఆలీ, మియాన్ ఖాన్, నిదా ఖాన్, సదియా యూసుఫ్, సిద్ర అమిన్, సిద్ర నవాజ్ (వికెట్ కీపర్) -
భారత్-జింబాబ్వే సిరీస్ రద్దు
-
భారత్ జింబాబ్వే సిరీస్ రద్దు!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటన రద్దయింది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ సోమవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీసీసీఐకు క్రికెట్ ప్రచారక బ్రాడ్ కాస్టింగ్ సంస్థ టెన్ స్పోర్ట్స్, జింబాబ్వే బ్రాడ్ కాస్టింగ్ సంస్థకు మధ్య కొన్ని వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని పరిష్కరించుకున్నాకే తుది నిర్ణయం వెలువరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచార హక్కులకు సంబంధించి ఒప్పందాల విషయంలో తేడా వచ్చిందని, వాటికి ఇంకా పరిష్కారం లభించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ ఉండగానే భారత్ బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆటలో భారత క్రికెటర్లు ఫేలవమైన ప్రదర్శన చేసినందున మరోసారి వారిని గాడిలో పెట్టాలని, మరోసారి హితబోధ చేసిన అనంతరమే మరో మ్యాచ్‌కోసం పంపించాలనే అభిప్రాయం బీసీసీఐకు ఉన్నట్లు సమాచారం. వచ్చే నెల జూలై 10 నుంచి భారత్ జింబాబ్వేలో వన్డే మ్యాచ్‌తోపాటు టీ ట్వంటీ కూడా ఆడాల్సి ఉంది. బ్రాడ్ కాస్టింగ్ వివాదం త్వరగా పరిష్కారం కాకుంటే వచ్చే ఏడాదికి ఈ మ్యాచ్‌లను వాయిదా వేయాలని కూడా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.