మ్యాచ్ ఓడాక వారి ముఖాలు ఎలా ఉన్నాయో..! | This video about the upcoming India vs West Indies semi-final match is spot on! | Sakshi
Sakshi News home page

మ్యాచ్ ఓడాక వారి ముఖాలు ఎలా ఉన్నాయో..!

Published Fri, Apr 1 2016 11:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

మ్యాచ్ ఓడాక వారి ముఖాలు ఎలా ఉన్నాయో..!

మ్యాచ్ ఓడాక వారి ముఖాలు ఎలా ఉన్నాయో..!

క్రికెట్ అంటే భారతీయులకు ఎంత పిచ్చో వేరే చెప్పనక్కర్లేదు. మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఎన్ని తిడతారో.. గెలిచినప్పుడు అంతగా పొగిడేస్తారు. ఇంకొందరైతే జరగబోయే మ్యాచ్ గురించి ముందే రకరకాల ఊహల్లో తేలిపోతుంటారు. అలాంటి ఊహలకు ప్రాణం పోసింది తాజాగా పొట్టి ప్రపంచ కప్. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టీ ట్వంటీ సెమీ ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో భారత్ పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్కన్నా ముందే కొందరు భారతీయ క్రికెట్ అభిమానులు ఓ వినూత్న వీడియోను రూపొందించి యూట్యూబ్లో పెట్టారు.

ఆ వీడియోలో చూపించిన ప్రకారం.. ఇండియా జెర్సీ వేసుకున్న వ్యక్తి దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా గోడవైపు తిరిగి నిల్చోగా అతడి వెనుక వెస్టిండీస్ జెర్సీ వేసుకున్న వ్యక్తి వామ్మో ఎలాగైనా ఇండియా చేతిలో పడొద్దని పారిపోతుంటాడు. తొలుత ఎంతో వేగంగా పరుగెత్తగా బంగ్లాదేశ్ జెర్సీ వేసుకున్న వ్యక్తి వెస్టండీస్ వ్యక్తికి సైకిల్ ఇస్తాడు.. కొద్ది దూరంగా వెళ్లగానే.. ఆస్ట్రేలియా జెర్సీతో ఉన్న వ్యక్తి వచ్చి బైక్ పై ఎక్కించుకుంటాడు. మరి కొద్ది దూరం వెళ్లగానే పాకిస్థాన్ జెర్సీతో ఉన్న వ్యక్తి కారులో ఎక్కించి అతడికి డబ్బు, సెల్ ఫోన్, ఇతర అవసరాలు అందించి పంపిస్తాడు.

హమ్మయ్య ఏదో ఒకలాగా ఇండియా నుంచి తప్పించుకున్నాను అనుకొని తిరువనంతపురంలోని ఓ పాతబడిన ఇంట్లో కూర్చోని సిగరెట్ తాగేందుకు అగ్గిపుల్ల గీస్తుండగా.. అది అంటుకోదు. అప్పుడు కోహ్లీ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి లైటర్ ఇస్తాడు. అంతే.. వెస్టిండీస్ జెర్సీతో ఉన్న వ్యక్తి అవాక్కవుతాడు. ఆ తర్వాత 'నువ్వు ఎక్కడికైనా పారిపోవచ్చు.. కానీ దాచుకోలేవు' ఇట్లు కోహ్లీ అంటే ఒక వాక్యం రావడంతో వీడియో అయిపోతుంది. అంటే దీని ప్రధాన ఉద్దేశం.. పొట్టి క్రికెట్ లో అన్ని టీంలను ఓడిస్తూ వచ్చిన టీమిండియా చేతిలో ఇప్పుడు వెస్టిండీస్ చిక్కిందని, దానిని కూడా ఇండియా ఎలాగో ఓడిస్తుందని, అంతకంటే ముందే ఇండియాకు కనిపించకుండా దాస్తే బాగుంటుందని ఇతర దేశాల అభిప్రాయం అన్నట్లుగా వీడియో తయారు చేశారు. పాపం ఎంతో కష్టపడి ఈ వీడియో రూపొందిచినవారి ముఖాలు వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓడాకా ఎలా ఉన్నాయో ఊహించుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement