ఆఫ్రిది ఆల్‌రౌండ్ షో | Pakistan's victory in the first match | Sakshi
Sakshi News home page

ఆఫ్రిది ఆల్‌రౌండ్ షో

Published Thu, Mar 17 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

ఆఫ్రిది ఆల్‌రౌండ్ షో

ఆఫ్రిది ఆల్‌రౌండ్ షో

తొలి మ్యాచ్‌లో పాక్ ఘన విజయం
55 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు

 
కోల్‌కతా: చాలా కాలంగా ఫామ్‌లో లేక ఇంటా బయటా రకరకాల విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఎట్టకేలకు స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచాడు. ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లోనూ చెలరేగి పాకిస్తాన్‌కు టి20 ప్రపంచకప్‌లో శుభారంభాన్ని అందించాడు. ఆఫ్రిది ఆల్‌రౌండ్ షోతో పాక్ జట్టు బంగ్లాదేశ్‌ను 55 పరుగులతో చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. షార్జీల్ ఖాన్ (10 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ షెహ్‌జాద్ (39 బంతుల్లో 52; 8 ఫోర్లు), హఫీజ్ (42 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో పాటు రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించారు.

ఆ తర్వాత వచ్చిన ఆఫ్రిది (19 బంతుల్లో 49; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు చేశాడు. చివర్లో షోయబ్ మాలిక్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కూడా రాణించంతో పాక్ 200 మార్కును దాటింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్, సన్నీ రెండేసి వికెట్లు తీశారు.

బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసి ఓడిపోయింది. తమీమ్ ఇక్బాల్ (20 బంతుల్లో 24; 2 సిక్సర్లు), షబ్బీర్ రహమాన్ (19 బంతుల్లో 25; 5 ఫోర్లు) నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించడంతో బంగ్లా విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే ఆఫ్రిది ఈ ఇద్దరినీ అవుట్ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీశాడు. షకీబ్ (40 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఒక ఎండ్‌లో పోరాడినా మరో ఎండ్‌లో ఎవరూ నిలబడలేదు. పాక్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆఫ్రిదితో పాటు ఆమిర్ కూడా రెండు వికెట్లు తీశాడు.
ఇటీవల ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమికి పాక్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
 
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: షార్జీల్ ఖాన్ (బి) సన్నీ 18; షెహ్‌జాద్ (సి) మహ్మదుల్లా (బి) షబ్బీర్ 52; హఫీజ్ (సి) సర్కార్ (బి) సన్నీ 64; ఆఫ్రిది (సి) మహ్మదుల్లా (బి) తస్కీన్ 49; ఉమర్ అక్మల్ (సి) షకీబ్ (బి) తస్కీన్ 0; షోయబ్ మాలిక్ నాటౌట్ 15; వసీమ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201.

వికెట్ల పతనం: 1-26; 2-121; 3-163; 4-175; 5-198.
బౌలింగ్: తస్కీన్ 4-0-32-2; అల్ అమిన్ 3-0-43-0; సన్నీ 4-0-34-2; షకీబ్ 4-0-39-0; మొర్తజా 3-0-41-0; షబ్బీర్ 2-0-11-1.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) వసీం (బి) ఆఫ్రిది 24; సౌమ్య సర్కార్ (బి) ఆమిర్ 0; షబ్బీర్ (బి) ఆఫ్రిది 25; షకీబ్ నాటౌట్ 50; మహ్మదుల్లా (సి) షార్జీల్ (బి) వసీం 4; ముష్ఫికర్ (సి) సర్ఫరాజ్ (బి) ఆమిర్ 18; మిథున్ (సి) ఆమిర్ (బి) ఇర్ఫాన్ 2; మొర్తజా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 146.

 వికెట్ల పతనం: 1-1; 2-44; 3-58; 4-71; 5-110; 6-117.
 బౌలింగ్: ఆమిర్ 4-0-27-2; ఇర్ఫాన్ 4-0-30-1; రియాజ్ 4-0-31-0; ఆఫ్రిది 4-0-27-2; షోయబ్ మాలిక్ 2-0-14-0; ఇమాద్ వసీం 2-0-13-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement