సౌతాంప్టన్: చిన్నప్పటి నుంచి దేశం తరుపున కనీసం ఒక్క ప్రపంచకప్ అయినా ఆడాలని కలలు కనే వాడినని టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ పేర్కొన్నాడు. ఇప్పుడా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తొలుత ప్రకటించిన జాబితాలో తన పేరులేనందుకు చాలా బాధపడ్డానని, అయితే తాను ఇంకా మెరుగుపడాలనే ఉద్దేశంతో కఠినంగా ప్రాక్టీస్ చేశానని వివరించాడు. శిఖర్ ధావన్ గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి వైదలగొడం బాధ కలిగించిందన్నాడు. అవకాశం వస్తే జట్టు కోసం తన వంతు పాత్ర పోషిస్తానని అన్నాడు.
‘ప్రపంచకప్‌కు ఎంపిక కానందుకు నేను బాధపడుతున్నప్పుడు మా అమ్మ వచ్చి తప్పకుండా నీకు పిలుపు వస్తుంది అని చెప్పింది. ధావన్‌కు బ్యాకప్‌గా ఇంగ్లండ్‌కు వెళ్లాలని బీసీసీఐ నుంచి ఫోన్ వచ్చిందని మా అమ్మకు చెప్పగానే వెంటనే గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంది. దేశం తరుపున ఆడే అవకాశం వచ్చింది, మంచిగా ఆడు అని చెప్పింది. శిఖి భాయ్(శిఖర్ ధావన్) గాయం కారణంగా దూరమవడం చాలా బాధ కలిగించింది.
ఇప్పుడు అందరిదీ ఓకే కల
ప్రస్తుతం మా అందరిదీ ఓకే కల. ప్రపంచకప్‌ను టీమిండియా గెలవాలి అందులో మా పాత్ర ఉండాలి అని. అందుకు తగ్గట్లే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఒక్క ప్రపంచకప్ అయినా ఆడాలని కలలు కనేవాడిని. అది నిజమైంది. ఇప్పుడు గెలవాలనే పట్టుదలతో ఉన్నా. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన తొలి జాబితాలో నా పేరు లేనందుకు చాలా బాధ పడ్డా. అయితే ఆ సమయంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్ పాంటింగ్, నా వ్యక్తిగత కోచ్‌లు, స్నేహితులు, కుటుంబభ్యులు ధైర్యం చెప్పారు’అంటూ రిషభ్ పంత్ వివరించాడు. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్ శనివారం అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.
చదవండి:
పంత్ ఆడేది చెప్పకనే చెప్పిన కోహ్లి?
ధావన్ ఔట్.. సచిన్ ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment