
సౌతాంప్టన్: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా ప్రపంచకప్ మిగతా మ్యాచ్‌లకు దూరం కావడంతో అతడి స్థానంలో యువ సంచలనం రిషభ్ పంత్ జట్టలోకి చేరాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో విజయాలతో దూసుకపోతున్న టీమిండియా శనివారం అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో పంత్ ఆడతాడా లేక పాకిస్తాన్ మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న విజయ్ శంకర్ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోతో పంత్ అఫ్గాన్ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంత్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ‘చాంప్‌తో సౌతాంప్టన్‌లో’అంటూ పేర్కొన్నాడు. దీంతో అఫ్గాన్‌తో మ్యాచ్‌లో పంత్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లి క్యాప్షన్ వెనుక ఇదే అర్థం ఉందని వారు పేర్కొంటున్నారు. ఇక ప్రాక్టీస్‌లో భాగంగా శంకర్ పాదానికి గాయం అయింది. అది అంత పెద్దది కాకపోయినా రిస్క్ చేయడం ఎందుకని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఇక ధావన్ నిష్క్రమణ అనంతరం స్పెషలిస్టు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు దీంతో పంత్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment