టీవీ కవరేజి ఉంటేనే మహిళల క్రికెట్‌కు ఆదరణ: మిథాలీ రాజ్‌ | Poor crowd in women’s matches due to lack of TV coverage: Raj | Sakshi
Sakshi News home page

టీవీ కవరేజి ఉంటేనే మహిళల క్రికెట్‌కు ఆదరణ: మిథాలీ రాజ్‌

Published Tue, May 23 2017 2:21 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

టీవీ కవరేజి ఉంటేనే మహిళల క్రికెట్‌కు ఆదరణ: మిథాలీ రాజ్‌

టీవీ కవరేజి ఉంటేనే మహిళల క్రికెట్‌కు ఆదరణ: మిథాలీ రాజ్‌

జొహన్నెస్‌బర్గ్‌: మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంతోనే స్టేడియాల్లో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటుందని భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఆరోపించింది. నాలుగు దేశాల సిరీస్‌లో భాగంగా జరిగిన ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు చాలా తక్కువ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

‘భారత్‌లో అయితే మ్యాచ్‌లను చూసేందుకు చాలా మంది స్టేడియాలకు వస్తారు. మహిళల క్రికెట్‌ను మార్కెట్‌ చేసుకోవడం ముఖ్యం. ఏదైనా సిరీస్‌ ఆడినప్పుడు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అయితే వారికి మ్యాచ్‌లను వీక్షించే అవకాశం లేకపోవడంతో ఇంటర్‌నెట్‌ను ఆశ్రయిస్తున్నారు’ అని మిథాలీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement