ముంబై వన్డే జట్టులో పృథ్వీ షా  | Prithvi Shaw included in Mumbai's Vijay Hazare squad | Sakshi
Sakshi News home page

ముంబై వన్డే జట్టులో పృథ్వీ షా 

Published Thu, Feb 1 2018 12:21 AM | Last Updated on Thu, Feb 1 2018 12:21 AM

Prithvi Shaw included in Mumbai's Vijay Hazare squad - Sakshi

పృథ్వీ షా

అండర్‌–19 ప్రపంచకప్‌లో యువ భారత జట్టును ముందుండి నడిపిస్తున్న కెప్టెన్‌ పృథ్వీ షా విజయ్‌ హజారే ట్రోఫీలో పాల్గొనే ముంబై వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా జరిగే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే 16 మంది సభ్యుల జట్టును ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ మంగళవారం ప్రకటించింది.

వికెట్‌ కీపర్‌ ఆదిత్య తారే సారథ్యం వహిస్తున్న ఈ జట్టులో పృథ్వీ షాకు స్థానం దక్కింది. ఈ ఏడాది రంజీ జట్టులో భాగమైన పృథ్వీ షా వన్డే జట్టుకు ఎంపికకావడం ఇదే తొలిసారి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement