బెంగళూరు: అఫ్గానిస్తాన్‌తో గురువారం నుంచి జరగనున్న చారిత్రక టెస్టు మ్యాచ్‌లో ఆడబోతుండటాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నానని భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్నఅఫ్గానిస్తాన్ జట్టు భారత్‌తో అరంగేట్రం టెస్టు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కాగా, అతని స్థానంలో సారథిగా రహానే ఎంపికయ్యాడు.
‘అఫ్గానిస్తాన్ తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడబోతుండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇది ఆ జట్టుకి ఓ చారిత్రక ఘటన అందులో భారత జట్టు భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. అఫ్గానిస్తాన్ జట్టులో చాలా మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తామేంటో ఇప్పటికే వారు నిరూపించుకున్నారు. కచ్చితంగా టెస్టు క్రికెట్‌లో కూడా ఆ స్థాయి ప్రదర్శనని కనబర్చేందుకు ప్రయత్నిస్తారు. భారత్ జట్టు తరపున అఫ్గాన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment