
గ్రేటర్ నోయిడా: వరుసగా మూడు సీజన్‌లలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న హరియాణా హ్యామర్స్ జట్టు నాలుగో సీజన్‌లో మాత్రం మెరిసింది. తొలిసారి ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) చాంపియన్‌గా అవతరించింది. గురువారం జరిగిన ఫైనల్లో హరియాణా హ్యామర్స్ 6–3తో గతేడాది విజేత పంజాబ్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. తొమ్మిది బౌట్‌లలో వరుసగా ఐదు బౌట్‌లలో గెలిచి హరియాణా జట్టు ట్రోఫీని ఖాయం చేసుకుంది.
విజేత ఖరారు కావడంతో పంజాబ్ రాయల్స్ చివరి నాలుగు బౌట్‌లలో మూడింటిలో గెలిచినా ఫలితం లేకపోయింది. హరియాణా హ్యామర్స్ తరఫున అలెగ్జాండర్ ఖొట్‌సియాన్‌వ్‌స్కీ (125 కేజీలు), అలీ షబనోవ్ (86 కేజీలు), కిరణ్ (మహిళల 76 కేజీలు), రవి కుమార్ (57 కేజీలు), అనస్తాసియా నిచిత (మహిళల 57 కేజీలు), తయానా ఒమెల్‌చెంకో (మహిళల 62 కేజీలు) గెలుపొందారు. పంజాబ్ రాయల్స్ తరఫున బజరంగ్ పూనియా (65 కేజీలు), అమిత్ ధన్‌కర్ (74 కేజీలు), అంజు (53 కేజీలు) నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment