Punjab Royals team
-
ప్రొ రెజ్లింగ్ లీగ్ విజేత హరియాణా హ్యామర్స్
గ్రేటర్ నోయిడా: వరుసగా మూడు సీజన్లలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న హరియాణా హ్యామర్స్ జట్టు నాలుగో సీజన్లో మాత్రం మెరిసింది. తొలిసారి ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) చాంపియన్‌గా అవతరించింది. గురువారం జరిగిన ఫైనల్లో హరియాణా హ్యామర్స్ 6–3తో గతేడాది విజేత పంజాబ్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. తొమ్మిది బౌట్లలో వరుసగా ఐదు బౌట్లలో గెలిచి హరియాణా జట్టు ట్రోఫీని ఖాయం చేసుకుంది. విజేత ఖరారు కావడంతో పంజాబ్ రాయల్స్ చివరి నాలుగు బౌట్లలో మూడింటిలో గెలిచినా ఫలితం లేకపోయింది. హరియాణా హ్యామర్స్ తరఫున అలెగ్జాండర్ ఖొట్సియాన్వ్స్కీ (125 కేజీలు), అలీ షబనోవ్ (86 కేజీలు), కిరణ్ (మహిళల 76 కేజీలు), రవి కుమార్ (57 కేజీలు), అనస్తాసియా నిచిత (మహిళల 57 కేజీలు), తయానా ఒమెల్చెంకో (మహిళల 62 కేజీలు) గెలుపొందారు. పంజాబ్ రాయల్స్ తరఫున బజరంగ్ పూనియా (65 కేజీలు), అమిత్ ధన్కర్ (74 కేజీలు), అంజు (53 కేజీలు) నెగ్గారు. -
పంజాబ్ రాయల్స్ బోణీ
లుథియానా: డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్ ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 4–3తో ఢిల్లీ సుల్తాన్స్పై గెలుపొందింది. నిర్ణాయక బౌట్లో కామన్వెల్త్, ఆసియా క్రీడల చాంపియన్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు) 9–0తో ఆండ్రి క్విట్కోస్కీను ఓడించి పంజాబ్‌ను విజేతగా నిలిపాడు. అంతకుముందు జరిగిన బౌట్లలో వినోద్ (74 కేజీలు) 0–14తో ఢిల్లీ రెజ్లర్ కెటిక్ సబలోవ్ చేతిలో కంగుతినగా, మహిళల 76 కేజీల విభాగంలో వెస్కన్ సింతియా 2–1తో శుస్తోవా అనస్తాసియా (ఢిల్లీ)పై గెలిచింది. 86 కేజీల్లో డటో మర్సగిష్విలి 12–0తో ప్రవీణ్ రాణా (ఢిల్లీ)పై నెగ్గగా, మహిళల 53 కేజీల్లో పింకీ (ఢిల్లీ) 9–4 అంజును ఓడించింది. కొరే జార్విస్ (125 కేజీలు) 7–2తో సతిందర్ మలిక్ (ఢిల్లీ)పై విజయం సాధించగా, అనిత 0–11తో సాక్షి మలిక్ (ఢిల్లీ) చేతిలో ఓటమి పాలైంది. చివరి దాకా ఇరు జట్లు చెరోటి గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈ దశలో బజరంగ్ ‘పట్టు’ పట్టడంతో పంజాబ్ ఖాతా తెరిచింది. -
ముంబై మహారథి శుభారంభం
పంచ్‌కులా (హరియాణా): ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సభ్యురాలిగా ఉన్న ముంబై మహారథి జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి పోటీలో ముంబై మహారథి 4–3తో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్‌ను ఓడించింది. 53 కేజీల బౌట్లో వినేశ్ (ముంబై) 8–0తో అంజుపై గెలిచింది. ముంబై తరఫున ఇలియాసోవ్ (57 కేజీలు), సచిన్ రాఠి (74 కేజీలు), నెమెత్ (76 కేజీలు) కూడా విజయం సాధించారు. పంజాబ్ రాయల్స్ తరఫున 65 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత బజరంగ్ పూనియా 8–2తో హర్ఫుల్పై గెలిచాడు. -
పంజాబ్ హ్యాట్రిక్ ప్రొ రెజ్లింగ్ లీగ్–2
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో పంజాబ్ రాయల్స్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. యూపీ దంగల్ జట్టుతో మంగళవారం జరి గిన మ్యాచ్‌లో పంజాబ్ రాయల్స్ 5–2తో గెలుపొందింది. తొలి లీగ్ మ్యాచ్‌లో ఓడిన పంజాబ్ ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం విశేషం. తాజా ఫలితంతో పంజాబ్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... జైపూర్ నింజాస్, ముంబై మహారథి, హరియాణా హ్యామర్స్ జట్లు నాలుగేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. పంజాబ్ తరఫున వ్లాదిమిర్ (57 కేజీలు) 6–2తో అమిత్ దహియాపై, జితేంద్ర (74 కేజీలు) 6–1తో గప్రిండాష్విలిపై, ఒడునాయో (53 కేజీలు) 16–0తో పింకీపై, ఇలియాస్ బెక్బులతోవ్ (65 కేజీలు) 6–3తో క్విటావ్స్కీపై, మర్జాలియుక్ (75 కేజీలు) 3–1తో మమాషుక్పై గెలిచారు. యూపీ దంగల్ జట్టు నుంచి ఎలిసా యంకోవా (48 కేజీలు) 2–1తో నిర్మలా దేవిపై, అమిత్ ధన్కర్ 13–5తో ప్రవీణ్ రాణా పై నెగ్గారు. యూపీ స్టార్ ప్లేయర్ గీతా ఫోగట్ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగకపోవడం గమ నార్హం. బుధవారం హరియాణా హ్యామర్స్‌తో ఢిల్లీ సుల్తాన్స్ తలపడుతుంది.