Pro Wrestling League
-
ప్రొ రెజ్లింగ్ లీగ్ విజేత హరియాణా హ్యామర్స్
గ్రేటర్ నోయిడా: వరుసగా మూడు సీజన్లలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న హరియాణా హ్యామర్స్ జట్టు నాలుగో సీజన్లో మాత్రం మెరిసింది. తొలిసారి ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) చాంపియన్‌గా అవతరించింది. గురువారం జరిగిన ఫైనల్లో హరియాణా హ్యామర్స్ 6–3తో గతేడాది విజేత పంజాబ్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. తొమ్మిది బౌట్లలో వరుసగా ఐదు బౌట్లలో గెలిచి హరియాణా జట్టు ట్రోఫీని ఖాయం చేసుకుంది. విజేత ఖరారు కావడంతో పంజాబ్ రాయల్స్ చివరి నాలుగు బౌట్లలో మూడింటిలో గెలిచినా ఫలితం లేకపోయింది. హరియాణా హ్యామర్స్ తరఫున అలెగ్జాండర్ ఖొట్సియాన్వ్స్కీ (125 కేజీలు), అలీ షబనోవ్ (86 కేజీలు), కిరణ్ (మహిళల 76 కేజీలు), రవి కుమార్ (57 కేజీలు), అనస్తాసియా నిచిత (మహిళల 57 కేజీలు), తయానా ఒమెల్చెంకో (మహిళల 62 కేజీలు) గెలుపొందారు. పంజాబ్ రాయల్స్ తరఫున బజరంగ్ పూనియా (65 కేజీలు), అమిత్ ధన్కర్ (74 కేజీలు), అంజు (53 కేజీలు) నెగ్గారు. -
పంజాబ్ రాయల్స్ బోణీ
లుథియానా: డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్ ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 4–3తో ఢిల్లీ సుల్తాన్స్పై గెలుపొందింది. నిర్ణాయక బౌట్లో కామన్వెల్త్, ఆసియా క్రీడల చాంపియన్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు) 9–0తో ఆండ్రి క్విట్కోస్కీను ఓడించి పంజాబ్‌ను విజేతగా నిలిపాడు. అంతకుముందు జరిగిన బౌట్లలో వినోద్ (74 కేజీలు) 0–14తో ఢిల్లీ రెజ్లర్ కెటిక్ సబలోవ్ చేతిలో కంగుతినగా, మహిళల 76 కేజీల విభాగంలో వెస్కన్ సింతియా 2–1తో శుస్తోవా అనస్తాసియా (ఢిల్లీ)పై గెలిచింది. 86 కేజీల్లో డటో మర్సగిష్విలి 12–0తో ప్రవీణ్ రాణా (ఢిల్లీ)పై నెగ్గగా, మహిళల 53 కేజీల్లో పింకీ (ఢిల్లీ) 9–4 అంజును ఓడించింది. కొరే జార్విస్ (125 కేజీలు) 7–2తో సతిందర్ మలిక్ (ఢిల్లీ)పై విజయం సాధించగా, అనిత 0–11తో సాక్షి మలిక్ (ఢిల్లీ) చేతిలో ఓటమి పాలైంది. చివరి దాకా ఇరు జట్లు చెరోటి గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈ దశలో బజరంగ్ ‘పట్టు’ పట్టడంతో పంజాబ్ ఖాతా తెరిచింది. -
ముంబై మహారథి శుభారంభం
పంచ్‌కులా (హరియాణా): ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సభ్యురాలిగా ఉన్న ముంబై మహారథి జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి పోటీలో ముంబై మహారథి 4–3తో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్‌ను ఓడించింది. 53 కేజీల బౌట్లో వినేశ్ (ముంబై) 8–0తో అంజుపై గెలిచింది. ముంబై తరఫున ఇలియాసోవ్ (57 కేజీలు), సచిన్ రాఠి (74 కేజీలు), నెమెత్ (76 కేజీలు) కూడా విజయం సాధించారు. పంజాబ్ రాయల్స్ తరఫున 65 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత బజరంగ్ పూనియా 8–2తో హర్ఫుల్పై గెలిచాడు. -
ముంబై మహారథి శుభారంభం
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ముంబై మహారథి జట్టు శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో ముంబై మహారథి 5–2తో ఢిల్లీ సుల్తాన్స్ జట్టును ఓడించింది. ముంబై మహారథి తరఫున మహిళల విభాగంలో సీమా (50 కేజీలు), వెస్కాన్ సింథియా (76 కేజీలు), సాక్షి మలిక్ (62 కేజీలు)... పురుషుల విభాగంలో సతిందర్ (125 కేజీలు), రమోనోవ్ (65 కేజీలు) విజయం సాధించారు. ఢిల్లీ తరఫున సందీప్ తోమర్ (57 కేజీలు), అస్లాన్ (92 కేజీలు) గెలుపొందారు. ఢిల్లీ సుల్తాన్స్ కెప్టెన్, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. ముంబై జట్టు కెప్టెన్ సాక్షి టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టులో క్లిష్టమైన బౌట్‌ను ‘బ్లాక్’ చేసే అవకాశం సంపాదించింది. 74 కేజీ విభాగంలో బరిలోకి దిగాల్సిన సుశీల్ కుమార్ బౌట్‌ను ఆమె బ్లాక్ చేసింది. దాంతో అతను పాల్గొనలేకపోయాడు. టాస్ ఓడిన సుశీల్ మహిళల 57 కేజీల విభాగాన్ని బ్లాక్ చేశాడు. దాంతో ఈ రెండు కేటగిరిలలో బౌట్లు జరగలేదు. -
సుశీల్‌కు రూ. 55 లక్షలు
న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత మళ్లీ మ్యాట్‌పై అడుగు పెట్టిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ప్రొ రెజ్లింగ్ లీగ్–3లో అత్యధిక ధర పలికింది. ఇటీవలే కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన సుశీల్‌ను ఢిల్లీ సుల్తాన్స్ ఫ్రాంచైజి రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. జనవరి 9 నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్ మూడో సీజన్ మొదలవుతుంది. శనివారం జరిగిన రెజ్లర్ల వేలం కార్యక్రమంలో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మలిక్‌ను ముంబై మహారథి జట్టు రూ. 39 లక్షలకు సొంతం చేసుకుంది. సాక్షి మలిక్ భర్త సత్యవర్త్ కడియాన్‌ను ముంబై జట్టు రూ. 12 లక్షలకు దక్కించుకుంది. యూపీ దంగల్ జట్టు రూ. 25 లక్షలకు బజరంగ్ పూనియాను... రూ. 40 లక్షలకు వినేశ్ ఫోగట్‌ను, రూ. 28 లక్షలకు గీత ఫోగట్‌ను దక్కించుకుంది. ఇరాన్ స్టార్ రెజ్లర్ హసన్ రహీమి సబ్జాలిపై హరియాణా హ్యామర్స్ జట్టు రూ. 46 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. -
పంజాబ్ హ్యాట్రిక్ ప్రొ రెజ్లింగ్ లీగ్–2
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో పంజాబ్ రాయల్స్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. యూపీ దంగల్ జట్టుతో మంగళవారం జరి గిన మ్యాచ్‌లో పంజాబ్ రాయల్స్ 5–2తో గెలుపొందింది. తొలి లీగ్ మ్యాచ్‌లో ఓడిన పంజాబ్ ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడం విశేషం. తాజా ఫలితంతో పంజాబ్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... జైపూర్ నింజాస్, ముంబై మహారథి, హరియాణా హ్యామర్స్ జట్లు నాలుగేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. పంజాబ్ తరఫున వ్లాదిమిర్ (57 కేజీలు) 6–2తో అమిత్ దహియాపై, జితేంద్ర (74 కేజీలు) 6–1తో గప్రిండాష్విలిపై, ఒడునాయో (53 కేజీలు) 16–0తో పింకీపై, ఇలియాస్ బెక్బులతోవ్ (65 కేజీలు) 6–3తో క్విటావ్స్కీపై, మర్జాలియుక్ (75 కేజీలు) 3–1తో మమాషుక్పై గెలిచారు. యూపీ దంగల్ జట్టు నుంచి ఎలిసా యంకోవా (48 కేజీలు) 2–1తో నిర్మలా దేవిపై, అమిత్ ధన్కర్ 13–5తో ప్రవీణ్ రాణా పై నెగ్గారు. యూపీ స్టార్ ప్లేయర్ గీతా ఫోగట్ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగకపోవడం గమ నార్హం. బుధవారం హరియాణా హ్యామర్స్‌తో ఢిల్లీ సుల్తాన్స్ తలపడుతుంది. -
రెజ్లింగ్ జట్టుకు సహ యజమానిగా కోహ్లి
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ‘బెంగళూరు యోధాస్’ జట్టుకు సహ యజమానిగా మారాడు.‘లీగ్‌లోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. బెంగళూరు నాకు కొత్త కాదు. ఈ నగరంతో నా అనుబంధాన్ని యోధాస్‌తో చేతులు కలపడం వల్ల మరింత పెంచుకున్నాను. మా జట్టు పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు. -
ప్రొ రెజ్లింగ్ లీగ్
పంజాబ్‌ను ఓడించిన ముంబై న్యూఢిల్లీ: గందరగోళ పరిస్థితుల మధ్య ప్రారంభమైన ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్) తొలి సీజన్లో ముంబై గరుడ 5-2తో పంజాబ్ రాయల్స్‌ను ఓడించింది. మహిళల 58కేజీ విభాగంలో పంజాబ్ స్టార్ రెజ్లర్ గీతా ఫోగట్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. ముంబై గరుడకు చెందిన సాక్షి మాలిక్ చేతిలో తను పరాజయం పాలైంది. 8-8తో ఈ బౌట్ సమానంగా నిలిచినా సాక్షి వరుసగా ఎక్కువ పాయింట్లు సాధించడంతో విజేతగా నిలిచింది. తొలి బౌట్లో చీర్‌లీడర్స్‌కు ఎక్కడ నిలబడాలో తెలీకపోవడం, మిగతావారు చుట్టూ మూగడంతో బౌట్ ఆరంభమైన 19 సెకన్లకే రిఫరీ ఆపివేశారు. కొన్ని బౌట్లలో గడియారాలు పనిచేయలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్ వారియర్స్ తరఫున ఆడాల్సిన రెజ్లర్ సుశీల్ కుమార్ నిర్వాహకుల వైఖరితో విసిగి లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో పీడబ్ల్యుఎల్ కళ తప్పినట్టయ్యింది. -
రోహిత్ బాటలోనే కోహ్లి!
న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రముఖ క్రికెటర్లు రెజ్లింగ్ బాట పడుతున్నారు. తొలుత రోహిత్ శర్మ రెజ్లింగ్ వైపు అడుగులు వేయగా.. ప్రస్తుతం టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఆ బాటలోనే నడిచాడు. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో భాగంగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ వారియర్స్ జట్టులో భాగస్వామ్యం దక్కించుకున్నరోహిత్ సహ యజమానిగా వ్యవహరిస్తుండగా.. తాజాగా బెంగళూరు యోధాస్ జట్టుకు విరాట్ కోహ్లి సహ యజమాని అయ్యాడు. దీంతో రెజ్లింగ్ లో భాగస్వామ్యం పంచుకున్నరెండో క్రికెటర్ గా విరాట్ గుర్తింపు పొందాడు.ఇలా విరాట్, రోహిత్ లతో పాటు, బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర కూడా రెజ్లింగ్ జట్లకు కో-ఓనర్స్ గా ఉండటంతో ఆ క్రీడకు ఆమాంతం ఆదరణ పెరిగిపోయింది. ప్రొ రెజ్లింగ్ లో బెంగళూరు యోధాస్ జట్టు దక్కడం పట్ల కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. 'బెంగళూర్ యోధాస్ జట్టుతో భాగస్వామ్యం కావడం నిజంగా నమ్మశక్యంగా లేదు. రెజ్లింగ్ లో జట్టుకు కొత్త కానీ.. నగరానికి కాదు. బెంగళూర్ జట్టు చాలా పటిష్టమైన జట్టు. మా జట్టులో యోధుల పోరాటాన్ని చూడటానికి ఆతృతుగా ఉన్నా' అని కోహ్లి పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉత్తరప్రదేశ్ వారియర్స్ తన మొదటి పోరులో బెంగళూర్ యోధాస్ తో తలపడనుంది. గురువారం రాత్రి ఆరంభం కాబోతున్న రెజ్లింగ్ తొలి పోరులో ఢిల్లీ వీర్ తో పంజాబ్ రాయల్స్ తలపడనుంది.