ప్రో కబడ్డీ తరహాలో ప్రో బాక్సింగ్.. | professional boxing competitions tobe launched | Sakshi
Sakshi News home page

ప్రో కబడ్డీ తరహాలో ప్రో బాక్సింగ్..

Published Wed, Aug 19 2015 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

ప్రో కబడ్డీ తరహాలో ప్రో బాక్సింగ్..

ప్రో కబడ్డీ తరహాలో ప్రో బాక్సింగ్..

హైదరాబాద్: క్రీడాభిమానులచే విశేష ఆదరణ పొందిన ప్రో కబడ్డీ (ప్రొఫెషనల్ కబడ్డీ) పోటీలు నిరాటంకంగా సాగుతున్న తరుణంలోనే ప్రొ బాక్సింగ్ (ప్రొఫెషనల్ బాక్సింగ్) లీగ్స్కు తెరతీసే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ (ఐఏబీఎఫ్) మాజీ కార్యదర్శి జనరల్ బ్రిగేడియర్ పీకే మురళీధరన్ రాజా బుధవారం హైదరాబాద్లో పలువురు బాక్సర్లు, బాక్సింగ్ సమాఖ్యల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

గత నెలలో ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) ఏర్పాటుతో ఇన్నాళ్లూ అమెచ్యూర్కే పరిమితమైన బాక్సర్లు ఇకపై కాసులు కురిపించే ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ హైదరాబాద్ క్లబ్ కల్చర్తో బాక్సింగ్కు మేలు జరుగుతుందన్నారు. అమెచ్యూర్లుగా తమ కెరీర్లకు ముగింపు పలికిన ఆటగాళ్లకు ప్రొ బాక్సింగ్ ఆదాయ మార్గంగా నిలుస్తుందని, తద్వారా క్రీడాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement