బ్యాంకాక్ : ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ కోసం చేసిన ప్రయత్నంలో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎందురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్, ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో 21-15, 21-18 తేడాతో ఓటమి పాలైంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీని కోల్పోయిన సింధు.. ఈ ఏడాది తొలి టైటిల్ కోసం సింధు శ్రమ కొనసాగుతోంది.
తొలి గేములో ఒకుహారా దూకుడును ప్రదర్శించి సులువుగానే నెగ్గింది. రెండో గేములో తొలుత 6-2తో సింధు ఆధిపత్యం కొనసాగించినా చివరివరకూ అదే అధిక్యాన్ని కాపాడుకోలేక పోయింది. దీంతో పుంజుకున్న జపాన్ షట్లర్ 18-18తో సింధు స్కోరును సమయం చేసింది. కీలకదశలో మూడు వరుస పాయింట్లు సాధించిన సింధు ప్రత్యర్థి ఒకుహారా గేమ్‌తో పాటు థాయ్‌లాండ్ ఓపెన్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సింధుకి ఇది మూడో రజత పతకం కాగా, ఇప్పటివరకూ 11 సార్లు సింధుతో తలపడిన జపాన్ షట్లర్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment