తొలిసారి క్వాలిఫయర్... | Qualifier Aljaz Bedene knocks out Bautista Agut; sets up final with Stan Wawrinka | Sakshi
Sakshi News home page

తొలిసారి క్వాలిఫయర్...

Published Sun, Jan 11 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

తొలిసారి క్వాలిఫయర్...

తొలిసారి క్వాలిఫయర్...

చెన్నై ఓపెన్ ఫైనల్లోకి బెడెన్

చెన్నై: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ స్లొవేనియా యువ ఆటగాడు అల్జాజ్ బెడెన్ చెన్నై ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 20 ఏళ్ల చెన్నై ఓపెన్ చరిత్రలో ఓ క్వాలిఫయర్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 156వ ర్యాంకర్ బెడెన్ 3-6, 6-3, 7-6 (10/8)తో ప్రపంచ 15వ ర్యాంకర్, మూడో సీడ్ రొబెర్టా బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై విజయం సాధించాడు.  ఆదివారం జరిగే ఫైనల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్)తో బెడెన్ తలపడతాడు. సెమీస్‌లో వావ్రింకా 7-5, 6-3తో నాలుగో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement