సంచలనాలకు స్థానం ఇవ్వకుండా ఊహించినట్టే టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ మరో ‘గ్రాండ్‌స్లామ్’ సమరానికి సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కగా... ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ వరుస సెట్‌లలో విజయాన్ని దక్కించుకున్నాడు.
న్యూయార్క్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) అంతిమ సమరానికి అర్హత సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్స్‌లో జొకోవిచ్ 2-6, 7-6 (7/4), 3-6, 6-3, 6-4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై; నాదల్ 6-4, 7-6 (7/1), 6-2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై నెగ్గి 37వ సారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు.
ఇప్పటిదాకా వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో నాదల్ 21సార్లు... జొకోవిచ్ 15సార్లు గెలిచారు. ఫెడరర్ (స్విట్జర్లాండ్), లెండిల్ (చెక్ రిపబ్లిక్) తర్వాత అత్యధికంగా 18 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరిన నాదల్ ఈ జాబితాలో పీట్ సంప్రాస్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెన్ శకంలో అత్యధిక మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడిన జోడిగా మెకన్రో-లెండిల్ పేరిట ఉన్న రికార్డును నాదల్, జొకోవిచ్ సోమవారం మ్యాచ్‌తో తెరమరుగు చేయనున్నారు.
పురుషుల ఫైనల్ నేటి అర్ధరాత్రి గం. 2.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
జొకోవిచ్‌తో నాదల్ ‘ఢీ’
Published Mon, Sep 9 2013 2:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement