U.s open
-
స్ట్రాటో ఆవరణకు చేరిన భారతీయుడు
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు క్రీడలు యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత మారిన్ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్ నిలిచాడు. ఫైనల్లో జపాన్‌కు చెందిన తార కియ్ నిషికోరిపై విజయం సాధించాడు. పాక్ స్పిన్నర్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. అజ్మల్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఆగస్టులో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అజ్మల్ బౌలింగ్ తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌క ఐసీసీకి నివేదించారు. దీంతో అజ్మల్‌కు పరీక్షలు నిర్వహించడంతో అతని బౌలింగ్ అక్రమమని తేలింది. నిషాకు జాతీయ మహిళల చెస్ చాంప్ జాతీయ మహిళల చాలెంజర్స్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిషా మెహతా గెలుచుకుంది. పనాజీ(గోవా)లో సెప్టెంబర్ 15న ముగిసిన పోటీల్లో నిషా మెహతా స్వర్ణపతకం సాధించింది. విజయలక్ష్మికి రజతం, తెలంగాణకు చెందిన హిందూజ రెడ్డి కాంస్యం గెలుచుకున్నారు. ప్రణయ్‌కు ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ భారత షటిలర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్నాడు. పాలెమ్‌బాంగ్ (ఇండోనేషియా)లో సెప్టెంబర్ 14న జరిగిన ఫైనల్లో అబ్దుల్ కోలిక్ (ఇండోనేషియా)ను ఓడించాడు. అతనికిది తొలి గ్రాండ్ ప్రి గోల్డ్‌టైటిల్. జాతీయం వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న సుప్రీం అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 12న తీర్పునిచ్చింది. సమాన అవకాశాలు, రక్షణ, పూర్తి భాగస్వామ్యం కల్పిస్తూ వికలాంగుల చట్టం 1995లో ఆమోదం పొందినప్పటికీ అమలు కాలేదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. భారత్ -వియత్నాం మధ్య ఏడు ఒప్పందాలు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వియత్నాం పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 15న ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చమురు గ్యాస్ రంగాల్లో సహకారం, భారత్ నుంచి రక్షణ కొనుగోళ్ల కోసం 10 కోట్ల డాలర్ల రుణం, ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు, కస్టమ్స్, యువజన వ్యవహారాలు, నైపుణ్యాల అభివృద్ధి, పశు వైద్యం వీటిలో ప్రధాన అంశాలు. ఈ పర్యటనలో రాష్ట్రపతి వియత్నాం అధ్యక్షుడు ట్రూన్ టాన్ సంగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛా నౌకాయానానికి ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. పీఎస్‌యూల వాటా విక్రయం ప్రభుత్వ రంగ సంస్థలు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్జీసీ), కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)లలో వాటాలను విక్రయించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సెప్టెంబర్ 10న ఆమోదం తెలిపింది. ఈ మూడు కంపెనీల్లో వాటాల విక్రయం వల్ల రూ. 43,800 కోట్లు సమకూరనున్నాయి. 7.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.8 శాతంగా నమోదైంది. ఇది జూలైలో 7.96 శాతంగా ఉన్నట్లు సెప్టెంబర్ 12న విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. కాగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. ఇది గత ఐదేళ్లలో అతి తక్కువ స్థాయికి చేరింది. ఉల్లి, కూరగాయలతోపాటు ఆహారోత్పత్తుల ధరలు భారీగా తగ్గడం వల్ల మొత్తం ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైంది. అంతర్జాతీయం బాల్య వివాహాల్లో భారత్‌ది రెండో స్థానం: ఐరాస భారతదేశం బాల్య వివాహాల్లో రెండో స్థానంలో ఉందని ఐక్య రాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2000-12 మధ్యలో ఐదేళ్ల లోపున్న బాలల వివరాలు నమోదు చేయని విషయంలో కూడా భారత్ మొదటి స్థానంలో ఉందని ‘బాలల జీవితాల అభివృద్ధి, భవిష్యత్తు మార్పు- 25 ఏళ్లుగా దక్షిణాసియాలో బాలల హక్కులు’ అనే అంశంపై వెల్లడైన యూనిసెఫ్ నివేదిక తెలిపింది. 2000-12 మధ్యలో 71 మిలియన్ల ఐదేళ్లలోపు బాలల వివరాలు భారత్ నమోదు చేయలేదని వెల్లడించింది. బాల్య వివాహాల్లో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉండగా, భారత్, నేపాల్, అఫ్గానిస్థాన్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసియాన్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆసియాన్‌తో సేవలు, పెట్టుబడులకు సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సెప్టెంబర్ 8న సంతకం చేసింది. ఆసియాన్ కూటమిలోని బ్రూనై, కాంబోడియా, లావోస్, మలేసియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల పార్లమెంట్లు ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంది. ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఐటీ, టెలికమ్యూనికేషన్స్, రవాణా రంగాల్లో ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. అవార్డులు ప్రొ. కమల్‌బవాకు మిడోరి పురస్కారం భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త, బోస్టన్లోని మసాచుసెట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కమల్ బవా ప్రతిష్టాత్మక మిడోరి-2014 పురస్కారానికి ఎంపికయ్యారు. జపాన్‌కు చెందిన పర్యావరణ ఫౌండేషన్ జీవ వైవిధ్యంలో కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తుంది. హిమాలయాల్లో వాతావరణ మార్పులపై పలు పరిశోధనలు చేసినందుకు కమల్‌బవా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన బెంగళూరులోని అశోకా ట్రస్టు ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బహుమతికి ఎంపికైన వారిలో ఘనా నేషనల్ బయో డైవర్సిటీ కమిటీ చైర్మన్ ఆల్ఫ్రెడ్ ఓటెంగ్-యెబోహ, అర్జెంటీనా జాతీయ పరిశోధన మండలి ప్రధాన పరిశోధకుడు బిబియానా విలో కూడా ఉన్నారు. ఈ అవార్డును జపాన్‌లోని అయోన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్, కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ సెక్రటేరియట్ 2010 నుంచి అందజేసున్నాయి. అవార్డుకు ఎంపికైన వారికి లక్ష డాలర్ల బహుమతి ప్రదానం చేస్తారు. అక్టోబర్ 15న దక్షిణ కొరియాలోని పియాంగ్ చాంగ్‌లో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)-12లో పురస్కారాన్ని అందజేస్తారు. బంగ్లాదేశ్, తూర్పు తైమూర్లకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రజారోగ్య పురస్కారాలు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజారోగ్య పురస్కారానికి బంగ్లాదేశ్ కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ జాతీయ సలహా కమిటీ చైర్పర్సన్ సైమా హుస్సేన్ ఎంపికయ్యారు. దక్షిణాసియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అటిజం (నాడీ సంబంధిత వ్యాధి)పై విస్తృత అవగాహన కల్పించినందుకు ఈమెకు ఈ అవార్డు దక్కింది. కాగా తైమూర్ దేశానికి చెందిన జాతీయ మలేరియా నివారణ కార్యక్రమం ప్రాంతీయ విభాగంలో అవార్డుకు ఎంపికయింది. దేశంలో మలేరియాను అరికట్టడానికి చేపట్టిన సమర్థమెన చర్యలకు ఈ గౌరవం లభించింది. సెప్టెంబర్ 10న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ అవార్డుల ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు సాక్షర భారత్ పురస్కారం ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ సాక్షర భారత్ - 2014 పురస్కారాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. అక్షర విజయం కార్యక్రమం ద్వారా ప్రకాశం జిల్లాలో కేవలం 9 నెలల కాలంలో 4.75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు జాతీయ సాక్షరతా మిషన్ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. నీలేకనికి వి.కృష్ణమూర్తి ఎక్స్‌లెన్స్ అవార్డు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్ మెంట్‌ను నెలకొల్పిన వి.కృష్ణమూర్తి ఎక్సలెన్స్ అవార్డు- 2014కు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నీలేకని ఎంపికయ్యారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. రాష్ట్రీయం హైకోర్టులో ఐదుగురు శాశ్వత న్యాయమూర్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ ఎ. రాజశేఖరరెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ సరసా వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ చల్లా. కోదండరామ్‌లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా సెప్టెంబర్ 5న వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్ 9న ప్రకటించారు. కాళోజీ శత జయంతి వేడుకల్లో భాగంగా వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ నిర్మించనున్న కాళోజీ కళా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రానిక్స్ విధానం ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబ ర్ 9న కొత్త ఎలక్ట్రానిక్స్ విధానం 2014-2020 ప్రకటించింది. ఈ విధానం ద్వారా రూ. 30వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది. ఆంధ్రాలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి సంస్థ (స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్)ను ఏర్పాటు చేసింది. దీనికి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐటీ రంగ నిపుణులు గంటా సుబ్బారావును, సంచాలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణలను నియమిస్తూ సెప్టెంబర్ 10న ఉత్తర్వులు జారీచేసింది. వార్తల్లో వ్యక్తులు ప్రపంచ బ్యాంకు ఈడీగా సుభాష్‌చంద్ర గార్గ్ భారత్ తరపున ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా సుభాష్‌చంద్ర గార్గ్ సెప్టెంబర్ 10న నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఆయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అస్కి చైర్మన్‌గా నరేంద్ర అంబ్వానీ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (అస్కి) చైర్మన్‌గా ఆగ్రోటెక్ ఫుడ్స్ డెరైక్టర్ నరేంద్ర అంబ్వానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకటనలకు ప్రమాణాలు నిర్దేశించే విషయంలో అస్కి కృషి చేస్తుంది. విద్యావేత్త కీర్తి జోషి మృతి విద్యావేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ విద్యా సలహాదారు కీర్తిజోషి (83) పుదుచ్చేరిలో సెప్టెంబర్ 14న మరణించారు. 1976లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను భారత ప్రభుత్వ విద్యాసలహాదారుగా నియమించింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివ ర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచన కీర్తిజోషిదే. సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రాటో ఆవరణకు చేరిన ఇస్రో శాస్త్రవేత్త సురేశ్‌కుమార్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త టి.ఎన్.సురేశ్‌కుమార్ భూ వాతావరణంలో రెండో పొర స్ట్రాటో ఆవరణ వరకు ప్రయాణించారు. దీంతో స్ట్రాటో ఆవరణ చేరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. ఆయన ఈ ఏడాది ఆగస్టు 15న రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరం నుంచి మిగ్-29లో 17,100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. ఈ నౌక 45 నిమిషాల్లో 1,850 కి.మీ వేగంతో స్ట్రాటో ఆవరణను చేరింది. రష్యాలోని కంట్రీ ఆఫ్ టూరిజం లిమిటెడ్ అనే స్పేస్ ట్రావెల్ సంస్థ ద్వారా కుమార్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ప్రపంచంలో ఈ యాత్ర చేపట్టిన వారిలో కుమార్ 259వ వ్యక్తి. ఎడ్జ్ ఆఫ్ స్పేస్ అనే ఈ యాత్రను ఆరేళ్ల కిందట ప్రారంభించారు. అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-1 క్షిపణిని రక్షణశాఖ సెప్టెంబర్ 10న ఒడిశాలోని బాలాసోర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. అణుసామర్థ్యం గల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయాణిస్తుంది. 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. రోడ్డు, రైల్ మొబైల్ లాంఛర్ల నుంచి ప్రయోగించవచ్చు. 1000 కిలోల సంప్రదాయ, అణు ఆయుధాలను మోసుకుపోగలదు. సెకనుకు 2.5 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 15 మీటర్ల పొడవు గల ఈ క్షిపణి బరువు 12 టన్నులు. -
దేశానికి, తెలంగాణకు అంకితం
యూఎస్ ఓపెన్ టైటిల్‌పై సానియా న్యూఢిల్లీ: ‘నా విజయాన్ని భారత దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, మా రాష్ట్ర ప్రజానీకానికి అంకితమిస్తున్నాను’... యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియామీర్జా వ్యాఖ్య ఇది. గతంలో తనంతట తాను ఎప్పుడూ విజయాలను ఎవరికో అంకితం చేస్తున్నట్లు ప్రకటించలేదు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్య చేసింది. దీనికి కారణం... తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలు అయిన తర్వాత వచ్చిన వివాదం. పాక్ క్రికెటర్‌ను పెళ్లి చేసుకున్న సానియా జాతీయతపై అప్పట్లో చర్చ జరిగింది. దీనికి తన విజయంతోనే సానియా సమాధానం చెప్పినట్లయింది. ‘రెండు వారాలు అద్భుతంగా గడిచాయి. యూఎస్ ఓపెన్ కూడా గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఏదో ఒక రోజు కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధిస్తాను’ అని సానియా తెలిపింది. వింబుల్డన్ మినహా సానియా మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలోనూ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది. టోర్నీ జరిగే సమయంలో తన మనసులో ఎలాంటి వివాదాల గురించిన ఆలోచనలు ఉండవని చెప్పిన సానియా... తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రణబ్, కేసీఆర్ అభినందనలు యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. ‘ఈ టైటిల్ సాధించడం ద్వారా సానియా... భారత్ గర్వపడేలా చేసింది’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘థ్యాంక్యూ సో మచ్ సర్’ అంటూ సానియా రీట్వీట్ చేసింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానియాను కొనియాడారు. ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని పెంచారు. మూడు గ్రాండ్‌స్లామ్స్ గెలుచుకున్నందుకు రాష్ట్ర ప్రజలు గర్విస్తున్నారు. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించి అద్భుత ఫలితాలు రాబట్టడమే మా ప్రభుత్వ విధానం’ అని కేసీఆర్ తన ప్రకటనలో తెలిపారు. -
మిల మిల మెరిసిన హైదరాబాదీ అణీముత్యం
-
శభాష్ సానియా
యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ వశం రూ.90 లక్షల 40 వేల ప్రైజ్‌మనీ సొంతం న్యూయార్క్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన సానియా మీర్జా తన భాగస్వామి బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-సోరెస్ ద్వయం 6-1, 2-6, 11-9తో అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)-శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా జోడికి లక్షా 50 వేల డాలర్లు (రూ. 90 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సానియా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గతంలో ఈ హైదరాబాద్ అమ్మాయి మహేశ్ భూపతి (భారత్) తో కలిసి 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్లలో మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ కైవసం చేసుకుంది. అన్‌సీడెడ్ స్పియర్స్-గొంజాలెజ్‌తో 60 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా జంట తొలి సెట్‌ను అలవోకగా నెగ్గినా... రెండో సెట్లో తడబడింది. దాంతో ఫలితం ‘సూపర్ టైబ్రేక్’ ద్వారా తేలింది. టైబ్రేక్‌లో సానియా జంట నిలకడగా రాణించి తొలుత 5-2తో... ఆ తర్వాత 9-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే స్పియర్స్-గొంజాలెజ్ ద్వయం వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి స్కోరును 9-9 వద్ద సమం చేసింది. అయితే సానియా జోడి సంయమనం కోల్పోకుండా వరుసగా రెండు పాయింట్లు సాధించి 11-9తో ‘సూపర్ టైబ్రేక్’ను దక్కించుకోవడంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో నిరాశ మరోవైపు గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 2-6, 4-6తో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంట చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు లక్షా 24 వేల 450 డాలర్లు (రూ. 75 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సూపర్ ఫెడరర్ ఐదుసార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ ఓటమి అంచుల్లో నుంచి గట్టెక్కి విజయతీరాలకు చేరాడు. తొమ్మిదోసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ 4-6, 3-6, 6-4, 7-5, 6-2తో 20వ సీడ్ గేల్ మోన్ఫిస్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. మూడు గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ నాలుగో సెట్లో 4-5 స్కోరు వద్ద రెండు మ్యాచ్ పాయింట్లను కాచుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-4, 7-6 (7/4)తో ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించి సెమీస్‌లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 5-0తో సిలిచ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. -
సంచలనాల పర్వం
ఐదో సీడ్ రావ్నిక్కు షాక్ నిషికోరి అద్భుత విజయం తొమ్మిదో సీడ్ సోంగా ఇంటిముఖం క్వార్టర్స్‌లో ముర్రే, జొకోవిచ్ ‘ఢీ’ యూఎస్ ఓపెన్ ఈసారి యూఎస్ ఓపెన్‌లో సీడెడ్ క్రీడాకారులకు కష్టకాలం నడుస్తోంది. తాజాగా పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ మిలోస్ రావ్‌నిక్, తొమ్మిదో సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా... మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ యుజెని బౌచర్డ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలై ఇంటిదారి పట్టారు. న్యూయార్క్: అమెరికా గడ్డపై ఆసియా యువకెరటం గర్జించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగింది. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ కీ నిషికోరి (జపాన్) 4-6, 7-6 (7/4), 6-7 (8/10), 7-5, 6-4తో ఐదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా)పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికా కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సోమవారం రాత్రి 10 గంటల 7 నిమిషాలకు మొదలై మంగళవారం తెల్లవారుజామున 2 గంటల 26 నిమిషాలకు ముగిసింది. యూఎస్ ఓపెన్ చరిత్రలో ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌గా ఉన్న రికార్డును ఈ మ్యాచ్ సమం చేసింది. 2012లో కోల్‌ష్రైబర్ (జర్మనీ)-జాన్ ఇస్నెర్ (అమెరికా); 1993లో మాట్స్ విలాండర్ (స్వీడన్)-మికేల్ పెర్న్ఫోర్స్ (స్వీడన్)ల మధ్య జరిగిన మ్యాచ్‌లు కూడా తెల్లవారుజామున 2 గంటల 26 నిమిషాలకు ముగిశాయి. ఈ గెలుపుతో 1922లో జెంజో షిమిద్జు తర్వాత యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి జపాన్ ప్లేయర్‌గా నిషికోరి గుర్తింపు పొందాడు. రావ్‌నిక్ 35 ఏస్‌లు సంధించినా... కీలకదశలో నిషికోరి అతని సర్వీస్‌లను బ్రేక్ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వరుసగా 22వసారి... మరోవైపు టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 7-5, 6-4తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై గెలిచి వరుసగా 22వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఆండీ ముర్రేతో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 7-5, 7-5, 6-4తో తొమ్మిదో సీడ్ సోంగా (ఫ్రాన్స్)ను ఓడించాడు. మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-5, 4-6, 7-6 (9/7), 6-2తో 16వ సీడ్ రొబ్రెడో (స్పెయిన్)పై గెలిచి నిషికోరితో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. ఈసారి బౌచర్డ్... మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ యుజెని బౌచర్డ్ (కెనడా) కూడా నిష్ర్కమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 17వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 7-6 (7/2), 6-4తో బౌచర్డ్ను బోల్తా కొట్టించింది. ప్రస్తుతం టాప్-10 సీడింగ్స్‌లో టాప్ సీడ్ సెరెనా, పదో సీడ్ వొజ్నియాకి మాత్రమే బరిలో ఉన్నారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 4-6, 6-4, 6-4తో క్వాలిఫయర్, ప్రపంచ 145వ ర్యాంకర్ అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)పై గెలిచింది. సానియా జోరు మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)-సోరెస్ (బ్రెజిల్) ద్వయం 7-5, 2-6, 10-5తో రోహన్ బోపన్న (భారత్)-స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 6-3, 6-2తో కౌకలోవా (చెక్ రిపబ్లిక్)-జంకోవిచ్ (సెర్బియా) జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పేస్ జోడిలకు చుక్కెదురు పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి 2-6, 6-4, 1-6తో గ్రానోలెర్స్-లోపెజ్ (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో లియాండర్ పేస్-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం 4-6, 6-4, 8-10తో స్పియర్స్ (అమెరికా)-గొంజాలెజ్ (మెక్సికో) జోడి చేతిలో ఓటమిపాలైంది. సెమీస్‌లో షుయె పెంగ్ మహిళల సింగిల్స్ విభాగంలో చైనా క్రీడాకారిణి షుయె పెంగ్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారిణుల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో షుయె పెంగ్ 6-2, 6-1తో బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. -
జొకోవిచ్‌తో నాదల్ ‘ఢీ’
సంచలనాలకు స్థానం ఇవ్వకుండా ఊహించినట్టే టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ మరో ‘గ్రాండ్‌స్లామ్’ సమరానికి సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కగా... ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ వరుస సెట్లలో విజయాన్ని దక్కించుకున్నాడు. న్యూయార్క్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) అంతిమ సమరానికి అర్హత సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్స్‌లో జొకోవిచ్ 2-6, 7-6 (7/4), 3-6, 6-3, 6-4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై; నాదల్ 6-4, 7-6 (7/1), 6-2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై నెగ్గి 37వ సారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో నాదల్ 21సార్లు... జొకోవిచ్ 15సార్లు గెలిచారు. ఫెడరర్ (స్విట్జర్లాండ్), లెండిల్ (చెక్ రిపబ్లిక్) తర్వాత అత్యధికంగా 18 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరిన నాదల్ ఈ జాబితాలో పీట్ సంప్రాస్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెన్ శకంలో అత్యధిక మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడిన జోడిగా మెకన్రో-లెండిల్ పేరిట ఉన్న రికార్డును నాదల్, జొకోవిచ్ సోమవారం మ్యాచ్‌తో తెరమరుగు చేయనున్నారు. పురుషుల ఫైనల్ నేటి అర్ధరాత్రి గం. 2.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
జొకోవిచ్‌తో నాదల్ ‘ఢీ’
సంచలనాలకు స్థానం ఇవ్వకుండా ఊహించినట్టే టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ మరో ‘గ్రాండ్‌స్లామ్’ సమరానికి సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ అనుభవాన్నంతా రంగరించి పోరాడి గట్టెక్కగా... ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ వరుస సెట్లలో విజయాన్ని దక్కించుకున్నాడు. న్యూయార్క్: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) అంతిమ సమరానికి అర్హత సాధించారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్స్‌లో జొకోవిచ్ 2-6, 7-6 (7/4), 3-6, 6-3, 6-4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై; నాదల్ 6-4, 7-6 (7/1), 6-2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై నెగ్గి 37వ సారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో నాదల్ 21సార్లు... జొకోవిచ్ 15సార్లు గెలిచారు. ఫెడరర్ (స్విట్జర్లాండ్), లెండిల్ (చెక్ రిపబ్లిక్) తర్వాత అత్యధికంగా 18 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరిన నాదల్ ఈ జాబితాలో పీట్ సంప్రాస్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెన్ శకంలో అత్యధిక మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడిన జోడిగా మెకన్రో-లెండిల్ పేరిట ఉన్న రికార్డును నాదల్, జొకోవిచ్ సోమవారం మ్యాచ్‌తో తెరమరుగు చేయనున్నారు. పురుషుల ఫైనల్ నేటి అర్ధరాత్రి గం. 2.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం