రాఫెల్ నాదల్ @ 61
దోహా: స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ కొత్త సీజన్‌కు టైటిల్‌తో శుభారంభం పలికాడు. ఖతార్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. అతని కెరీర్‌లో ఇది 61వ ఏటీపీ వరల్డ్ టూర్ టైటిల్ కావడం విశేషం. ఇక్కడ ఆరుసార్లు బరిలోకి దిగిన టాప్‌స్టార్ ఎట్టకేలకు తొలిసారి టైటిల్ సాధించాడు. ఆదివారం తుదిపోరులో 6-1, 6-7 (7/5), 6-2తో ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మోన్‌ఫిల్స్‌ను మట్టికరిపించాడు.
ఇక్కడ రాఫెల్‌పై మోన్‌ఫిల్స్‌దే పైచేయి. గత 2009, 2012 టోర్నీల్లో స్పెయిన్ స్టార్‌ను కంగుతినిపించాడు. కానీ ఈ సారి మాత్రం నాదల్ దూకుడుకు తలవంచాడు. ఏటీపీ వరల్డ్ టూర్ టైటిల్స్ గెలిచిన టాప్-10 జాబితాలో ప్రస్తుతం నాదల్ (61)... అండ్రీ అగస్సీ (60 టైటిల్స్)ని వెనక్కినెట్టి 8వ స్థానంలో నిలిచాడు. కెరీర్‌లో తొలిసారి టైటిల్‌తో సీజన్‌ను ఆరంభించడం ప్రత్యేక అనుభూతినిచ్చిందని మ్యాచ్ ముగిసిన అనంతరం నాదల్ వ్యాఖ్యానించాడు.