
విదేశీపిచ్‌ల పై ఆడటానికి భారత ప్లేయర్లు భయపడుతున్న సమయంలో ఇండియాకు దొరికిన ఆణిముత్యం అతడు. తన తోటి బ్యాట్స్‌మెన్స్ అంతా ప్రత్యర్థులు బౌలింగ్ దాటికి వికెట్ సమర్పించుకుంటుంటే అతను మాత్రం వికెట్లకు బాల్‌కు మధ్య ఒక గోడలా నిలబడేవాడు. చైనాను రక్షించేందుకు చైనా వాల్ ఉన్నట్లే కష్టాల్లో ఉన్న ఇండియా జట్టును రక్షించేందుకు రక్షణకవచంలా ఉండే వాడు. అతడే ది వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా ప్రసిద్ది చెందిన రాహుల్ ద్రావిడ్. రాహుల్‌దద్రావిడ్ పుట్టిన రోజు సందర్భంగా సాక్షి డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.