విజయానంతరం మాట్లాడుతున్న రాహుల్ ద్రవిడ్
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్‌కప్‌ను భారత యువ జట్టు గెలవడంపై ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆనంద వ్యక్తం చేశారు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘కుర్రాళ్ల ఆట పట్ల గర్వంగా ఫీలవుతున్నాను. ఈ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర మరవలేనిది. గత 14 నెలలుగా మేం కష్టపడ్డాం. ఈ గెలుపుకు మేం అర్హులమే. ఈ విజయం ఆటగాళ్లకు చిరకాలం గుర్తుండిపోయేదే. ఇక కుర్రాళ్లుకు ఈ విజయం ఓ తీపి గుర్తే కాకుండా వారి భవిష్యత్తును నిర్ధేశిస్తుంది. వారి కెరీర్‌లో ఇలాంటి విజయాలు మరిన్ని అందుకుంటారు. కోచ్‌గా చాల శ్రద్ధ వహించాను. దీనికి ఇతర సహాయక సిబ్బంది చాలా మద్దతిచ్చారు. గత 14 నెలలుగా 8 మంది సిబ్బందిమి తీవ్రంగా శ్రమించాం. ఈ ప్రయత్నం అద్భుతాన్ని ఇచ్చింది. జట్టు సహాయక సిబ్బందిలో నేను ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. కుర్రాళ్లకు ఏం కావాలో అదే అందించాం. వారు మైదానంలో అద్భుతంగా రాణించారు.’ అని ద్రవిడ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇక శనివారం ఆసీస్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసి వరల్డ్ కప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆసీస్ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్నిఓపెనర్ మన్‌జోత్ కల్రా అజయ సెంచరీతో 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా నాలుగోసారి వరల్డ్ కప్‌ను ఖాతాలో వేసుకుని అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment