పుణే: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ల పతకాల వేట కొనసాగుతోంది. పోటీల మూడో రోజు భారత్‌కు ఏడు పతకాలు లభించగా... అందులో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల వెంకట్ రాహుల్ జూనియర్ పురుషుల 85 కేజీల విభాగంలో మొత్తం 327 కేజీల బరువెత్తి స్వర్ణం నెగ్గగా... అంతే మొత్తానికి సీనియర్ పురుషుల విభాగంలో రజతం సాధిం చాడు. స్నాచ్‌లో రాహుల్ 181 కేజీలు ఎత్తి జూనియర్ కామన్వెల్త్ పోటీల్లో మీట్ రికార్డు నెలకొల్పాడు.
యూత్ మహిళల 63 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి. లలిత (164 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకుంది. సీనియర్, జూనియర్ మహిళల 63 కేజీల విభాగాల్లో పూనమ్ యాదవ్ (200 కేజీలు) రెండు స్వర్ణాలు సాధించింది. సీనియర్ పురుషుల 85 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ (335 కేజీలు) పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. జూనియర్ మహిళల 69 కేజీల విభాగంలో స్వప్నప్రియ బారువా (170 కేజీలు) స్వర్ణం సాధించింది.
రాహుల్‌కు స్వర్ణ, రజతాలు
Published Thu, Oct 15 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM
Advertisement