సెంచూరియన్:భారత్-దక్షిణాఫ్రికాల రెండో టెస్టు మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారాడు. సోమవారం మూడో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడుతుండగా భారీ వర్షం పడింది. సఫారీలు 23.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 68 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. టీ విరామం తరువాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచే సమయానికి డీన్ ఎల్గర్(29 బ్యాటింగ్), ఏబీ డివిలియర్స్(35 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. మళ్లీ దాదాపు అరగంట తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
ఈ రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. టీమిండియా ప్రధాన పేసర్ జస్ర్పిత్ బూమ్రా స్వల‍్ప వ్యవధిలో రెండు వికెట్లు సాధించి సఫారీలను కష్టాల్లోకి నెట్టాడు. ఓపెనర్ మర్‌క్రామ్(1), హషీమ్ ఆమ్లా(1)లను అవుట్ చేసి సత్తాచాటాడు. ఈ ఇద్దర్నీ ఎల్బీలుగా పెవిలియన్‌కు పంపడంతో దక్షిణాఫ్రికా మూడు పరుగులకే రెండు కీలక వికెట్లను నష్టపోయింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి మర్‌క్రామ్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్న బూమ్రా.. ఆరో ఓవర్ మూడో బంతికి ఆమ్లాను కూడా అదే తరహాలో పెవిలియన్‌కు చేర్చాడు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 335 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 68/2
భారత్ తొలి ఇన్నింగ్స్ 307
Comments
Please login to add a commentAdd a comment