టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు
సాక్షి, కొలంబో: మరికొద్ది సేపట్లో శ్రీలంకతో చివరి యుద్ధానికి రంగం సిద్ధం అవుతోంది. అయితే సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణపై పలు సందేహాలు ఏర్పడ్డాయి. అయితే వాటన్నింటిని బద్దలు కొడుతూ బీసీసీఐ మ్యాచ్ జరుగుతుందని ప్రకటించింది. స్టేడియాన్ని కవర్ చేస్తే కప్పిన కవర్లను తొలగించినట్లు ట్విట్టర్‌లో తెలిపింది. మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభమౌతుందని, టాస్ వేయడం కూడా ఆలస్యంఅవుతందని ప్రకటించింది.
ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లు క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఏకైక టీ20 మ్యాచ్‌పై కన్నేసింది. అన్ని ఫార్మాట్లలో శ్రీలంకపై పైచేయి సాధించిన భారత్ ఈ ఏకైక మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటోంది. అందుకే తీవ్ర కసరత్తులు చేస్తోంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో మూడేసి టి20 మ్యాచ్‌లు ఉండడంతో ఈ ఫార్మాట్‌లో జట్టు బ్యాటింగ్ లైనప్‌ను పరీక్షించుకునేందుకు ఈ మ్యాచ్‌ను వినియోగించువాలని భావిస్తోంది.
ఇక శ్రీలంక విషయానికి వస్తే సొంత గడ్డపై భారత్ చేతిలో వరుస ఓటములను ఎదుర్కొన్న ఆతిథ్య జట్టు కనీసం ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా గెలివాలనే కసితో ఉంది. ఎలాగైనా టీ20లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతోంది. అందుకే టి20 జట్టులో పెద్ద ఎత్తున మార్పులు చేసింది. రెండు జట్ల మధ్య జరిగిన టీ20 రికార్డులు పరిశీలిస్తే మొత్తం పది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఆరు మ్యాచ్‌లు గెలవగా, శ్రీలంక నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. సాయంత్రం 7 గం. నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
UPDATE- The toss has been delayed. Inspection at 7 PM #SLvIND
— BCCI (@BCCI) September 6, 2017
It has stopped raining and the covers are coming off now #SLvIND pic.twitter.com/7vVsmRhK95
— BCCI (@BCCI) September 6, 2017