
కోల్ కతా: భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టును వరుణుడు వీడటం లేదు. తొలి రోజు దాదాపు 11 ఓవర్ల పాటే సాధ్యమైన ఆట.. రెండో రోజు సుమారు 20 ఓవర్లే కుదిరింది. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా జట్టు స్కోరు 74/5 వద్ద ఉండగా భారీ వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కూడా వర్షం ఎంతకీ తెరుపు ఇవ్వకపోవడంతో రెండో రోజు ఆటను కూడా రద్దు చేయకతప్పలేదు. ఈ రెండు రోజుల ఆటలో మొత్తంగా32.5 ఓవర్ల మాత్రమే సాధ్యం కావడం ఇక్కడ గమనార్హం.
17/3 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా..మరో 33 పరుగులు జోడించి మరో రెండు వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆట ఆరంభంలోనే ఓవర్ నైట్ ఆటగాడు అజింక్యా రహానే(4), అశ్విన్(4) వికెట్లను భారత్ కోల్పోయింది. దాంతో 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రహానే, అశ్విన్ లిద్దరూ లంక మీడియం పేసర్ దాసన్ షనక బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. ఓవర్ నైట్ ఆటగాడు చతేశ్వర పుజారా(47 బ్యాటింగ్;102 బంతుల్లో9 ఫోర్లు), సాహా(6 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. భారత్ కోల్పోయిన ఐదు వికెట్లలోలక్మల్ మూడు వికెట్లు సాధించగా, షనకకు రెండు వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment