![Rajasthan Royals To Wear New Jersey With Chennai Match - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/19/rajasthan-royals.jpg.webp?itok=QYoWv6aK)
జైపూర్: ఐపీఎల్ సీజన్‌లో 2011 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక మ్యాచ్‌లో ‘గో గ్రీన్’ అని ఆకుపచ్చ జెర్సీ ధరించి ఆడుతున్నారు. గత ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్స్ గ్రీన్ కలర్ జెర్సీ ధరించి ఆడిన విషయం తెలిసిందే. ప్రజల్లో పర్యావరణ అవగాహన కల్పించడమే దాని ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం అదే బాటలో రాజస్థాన్ రాయల్స్ జట్టు పయనించనుంది.
మే11న జైపూర్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ ప్రస్తుతం ధరించే జెర్సీలో కాకుండా కొత్త జెర్సీతో రంగంలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని జట్టు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రంజిత్ వెల్లడించారు. ప్రజల్లో క్యాన్సర్ పై కనీస అవగాహన కల్పించేందుకు రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు.
క్యాన్సర్‌ను మొదటి దశలోని గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి అనే దానిపై వీరు అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ‘క్యాన్సర్ ఔట్’ అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకపోనున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్రాయల్స్ ఓడిపోయిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment