
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 27 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లను కింగ్స్ పంజాబ్ పేసర్ అన్‌కిత్ రాజ్‌పుత్ సాధించి సన్‌రైజర్స్ కోలుకోలేని షాకిచ్చాడు.
తొలి ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన రాజ్‌పుత్..మూడో ఓవర్ రెండో బంతికి శిఖర్ ధావన్(11)ను ఔట్ చేశాడు. అన్‌కిత్ రాజ్‌పుత్ వేసిన ఐదో ఓవర్‌లో వృద్ధిమాన్ సాహా(6) కూడా పెవిలియన్ బాటపట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment