హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌లు ఆరు కాగా, అందులో నాలుగు విజయాల్ని, రెండు పరాజయాల్ని చవిచూసింది. తొలుత హ్యాట్రిక్ విజయాలతో దుమ్మురేపిన హైదరాబాద్.. ఆపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ మరోసారి జూలువిదిల‍్చింది. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 118 పరుగులు మాత్రమే చేసినా, ముంబైను 87 పరుగులకే ఆలౌట్ చేసి చిరస‍్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది.
కాగా, గురువారం నగరంలోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో కింగ్స్ పంజాబ్‌తో పోరుకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. కింగ్స్ పంజాబ్ సొంత మైదానం ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పోరాడి ఓటమి పాలైంది. దాంతో తాజా మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది సన్‌రైజర్స్. గత మ్యాచ్‌లో చేసిన తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా కింగ్స్ పంజాబ్‌పై లెక్కసరిచేయాలని విలియమ్సన్ అండ్ గ్యాంగ్ యోచిస్తోంది. ఇక్కడ కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌లో బలంగా ఉండగా, సన్‌రైజర్స్ బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. దాంతో ఇరు జట్ల మధ్య మరోసారి ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్..తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పంజాబ్ జట్టులోకి క్రిస్ గేల్ తిరిగి రాగా, డేవిడ్ మిల్లర్‌ను రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేశారు. ఇక మనోజ్ తివారీకి తుది జట్టులో చోటు కల్పించారు. యువరాజ్ సింగ్ స్థానంలో తివారీకి అవకాశం దక్కింది. మరొకవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment