హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మనీష్ పాండే(54) హాఫ్ సెంచరీకి తోడు షకిబుల్ హసన్(28),యూసఫ్ పఠాన్(21నాటౌట్), మోస్తరుగా ఫర‍్వాలేదనిపించడంతో సన్‌రైజర్స్ సాధారాణ స్కోరును చేయగల్గింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. 27 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. అన్‌కిత్ రాజ్‌పుత్ దెబ్బకు సన్‌రైజర్స్ విలవిల్లాడి వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. తొలి ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన రాజ్‌పుత్..మూడో ఓవర్ రెండో బంతికి శిఖర్ ధావన్(11)ను ఔట్ చేశాడు. అన్‌కిత్ రాజ్‌పుత్ వేసిన ఐదో ఓవర్‌లో వృద్ధిమాన్ సాహా(6) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరుణంలో మనీష్ పాండే-షకిబుల్ జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 52 పరుగుల్ని జత చేసిన తర్వాత షకిబుల్ పెవిలియన్ చేరాడు. ఆపై మనీష్ పాండేతో కలిసిన యూసఫ్ పఠాన్‌తో స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే మనీష్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ జోడి మరో 49 పరుగుల్ని జత చేయడంతో సన్‌రైజర్స్ తేరుకుంది. చివరి ఓవర్‌లో మనీష్ పాండే, నబీలు ఔట్ కావడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో రాజ్‌పుత్ ఐదు వికెట్లు సాధించగా,ముజిల్ ఉర్ రహ్మాన్ వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment