
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్.. తొలుత హ్యాట్రిక్ విజయాలు సాధించిన సన్‌రైజర్స్.. ఆపై రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమి పాలైంది. అటు తర్వాత డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకుని 18 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది.
అయితే ప్లేఆఫ్స్‌లో కొన్ని మార్పులు తప్పవని అంటున్నాడు సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. పక్కా ప్రణాళికతో ప్లేఆఫ్స్‌లో బరిలో దిగుతామని స్పష్టం చేశాడు. దీనిలో భాగంగా కొన్ని మార్పులు తప్పవనే సంకేతాలిచ‍్చాడు. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమకంటే మెరుగ్గా ఆడిందని తెలిపాడు. ‘సన్‌రైజర్స్ ఆటగాళ్ళు బాగానే ఆడారు. కానీ కోల్‌కతా మాకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడిక ప్లేఆఫ్స్ సమయం. మా బలాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాం. ప్లేఆఫ్స్‌లో పక్కా ప్రణాళికతో బరిలో దిగుతాం. గెలుపు బాట పట్టడానికి కొన్ని మార్పులు తప్పనిసరి’ అని విలియమ్సన్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment