పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక‍్కడ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ధావన్(79;49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలియమ్సన్(51; 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు మరోసారి మెరవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలెక్స్ హేల్స్(2) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో శిఖర్ ధావన్‌తో కలిసి కేన్ విలియమ‍్సన్ ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే ముందుగా ధావన్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై విలియమ్సన్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే జట్టు స్కోరు 141 పరుగుల వద్ద ఉండగా ధావన్(79;49 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలియమ్సన్(51; 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు వరుసగా పెవిలియన్ చేరారు. ముందుగా డ్వేన్ బ్రేవో వేసిన16 ఓవర్ చివరి బంతికి ధావన్ ఔట్ కాగా, ఆపై శార్దూల్ ఠాకూర్ వేసిన 17 ఓవర్ తొలి బంతికి విలియమ్సన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మనీష్ పాండే(5) నిరాశపరిచాడు. ఇక దీపక్ హుడా(21 నాటౌట్;11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్), షకీబుల్ హసన్(8 నాటౌట్; 6 బంతుల్లో 1 ఫోర్) సమయోచితంగా ఆడటంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment