
రవి సవానీ రాజీనామా
బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవానీ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్-8కు ముందే ఆయన తప్పుకుంటానని చెప్పినా బోర్డు కోరికపై ఇప్పటిదాకా కొనసాగారు. ప్రస్తుతం ఇదే విభాగంలో సలహాదారుగా ఉన్న నీరజ్‌కుమార్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.