
రవిశాస్త్రి బూతుపురాణం!
వాంఖడే క్యురేటర్‌ను తిట్టిన డైరెక్టర్
ముంబై: ఐదో వన్డేలో భారత్ చిత్తుగా ఓడటాన్ని జీర్ణించుకోలేని భారత టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి ఆ కోపాన్ని పిచ్ క్యురేటర్‌పై చూపించాడు. తాము కోరినట్లుగా స్పిన్ పిచ్ రూపొందించలేదంటూ వాంఖడే క్యురేటర్ సుధీర్ నాయక్‌ను అతను తిట్టిపోశాడు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిశాక గ్రేట్ వికెట్ అంటూ వ్యంగ్యంతో మొదలు పెట్టి అతను మరాఠీలో బూతు పురాణం లంకించుకోవడంతో అక్కడ ఉన్నవారందరూ విస్తుపోయారు. అయితే సుధీర్ నాయక్ కూడా నాకు పిచ్ గురించి నేర్పించొద్దు. నేనూ భారత్‌కు ఆడాను అని ఘాటుగా బదులిచ్చినట్లు తెలిసింది. అధికారికంగా ఫిర్యాదు ఇవ్వకపోయినా... ముంబై క్రికెట్ సంఘం దృష్టికి ఈ అంశాన్ని నాయక్ తీసుకెళ్లారు.