అశ్విన్ ను ప్రయోగిస్తారా? | Ravichandran Ashwin against southpaws will be a preferred choice | Sakshi
Sakshi News home page

అశ్విన్ ను ప్రయోగిస్తారా?

Published Sat, Jun 10 2017 5:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

అశ్విన్ ను ప్రయోగిస్తారా?

అశ్విన్ ను ప్రయోగిస్తారా?

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో  ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ లో ఫాస్ట్ పిచ్ల నేపథ్యంలో స్పిన్నర్ అయిన అశ్విన్ ను పక్కను పెట్టాల్సి వచ్చింది.  అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్ కు అశ్విన్ కు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ లో డీకాక్, డుమిని, డేవిడ్ మిల్లర్ల వంటి ఎడమచేతి స్టార్ ఆటగాళ్లు ఉండటం చేత అశ్విన్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కష్టం కనుక అశ్విన్ ను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు.
 

రేపటి మ్యాచ్ లో అశ్విన్ కు చోటు దక్కుతుందని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకన్జీ సైతం అభిప్రాయపడ్డాడు. తమతో చావో రేవో మ్యాచ్ లో అశ్విన్ ఎంపిక  కూడా కీలకం కానుందని మెకన్జీ పేర్కొన్నాడు.ఈ మేరకు భారత జట్టు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయన్నాడు. మరొకవైపు శ్రీలంకతో ఓటమి భారత ఆటగాళ్ల మదిలో తీవ్రంగా ఉందన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ పై  ఒత్తిడి నెలకొన్న తరుణంలో దాన్నిసద్వినియోగం చేసుకుంటామన్నాడు. అయితే ఒక్క మ్యాచ్ లో ఓటమితో భారత్ ను తక్కువగా అంచనా వేయడం లేదన్నాడు. కచ్చితంగా భారత్ తో రసవత్తర పోరు ఖాయమన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement