క్రికెటర్ జడేజా పెళ్లిలో కాల్పులమోత.. | Ravindra Jadeja Marriage Runs Into Controversy After Gunfire Shots | Sakshi
Sakshi News home page

క్రికెటర్ జడేజా పెళ్లిలో కాల్పులమోత..

Apr 18 2016 3:24 AM | Updated on Sep 3 2017 10:08 PM

క్రికెటర్ జడేజా పెళ్లిలో కాల్పులమోత..

క్రికెటర్ జడేజా పెళ్లిలో కాల్పులమోత..

టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడ్డేజా వివాహం వివాదంలో చిక్కుకుంది.

టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా వివాహం వివాదంలో చిక్కుకుంది. ఆదివారం పెళ్లి సందర్భంగా వరుడికి కొద్దిదూరంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా తీసిన బరాత్‌లో వరుడు జడేజాకు సమీపంలో ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

ఈ కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ' కాల్పులు జరిగినట్టు కంట్రోల్‌ రూమ్ నుంచి మాకు సమాచారం వచ్చింది. మేం వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నాం. లైసెన్స్‌ కలిగిన తుపాకీతో కాల్పులు జరిపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే దీనిని వాడాల్సి ఉంటుంది. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది' అని లోధికా పోలీసు స్టేషన్ పీఎస్సై మహేంద్రసింగ్ రాణా తెలిపారు.

తల్వార్ తిప్పిన వరుడు!
జడేజా ఆదివారం తన ఇష్టసఖి రీవా సోలంకీని పెళ్లాడుతున్నారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ పెళ్లికి తన సన్నిహిత మిత్రులైన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్‌ రైనా డ్వేన్ బ్రావోతోపాటు పలువుకు క్రికెటర్లు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సాయంత్రం రాజ్‌కోట్‌లో రిసెప్షన్‌ జరుగనుంది. పెళ్లి బరాత్‌లో వరుడు జడేజా తల్వార్‌ తిప్పుతూ హల్‌చల్‌ చేశాడు. అతడి తల్వార్ డాన్స్‌ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement