జింబాబ్వే టూర్ నుంచి రాయుడు అవుట్
హరారే: టీమిండియా బాట్స్ మన్ అంబటి రాయుడు గాయం కారణంగా జింబాబ్వే పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్ సంజూ శామ్సన్ ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది. రెండో వన్డేలో రాయుడు గాయపడ్డాడు. దీంతో అతడికి తొడ కండరాలు పట్టేశాయి. అతడికి 2 నుంచి 3 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని బీసీసీఐ వెల్లడించింది.
జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో రాయుడు అద్భుతంగా ఆడి సెంచరీ(124) సాధించాడు. రెండో వన్డేలో 41 పరుగులు చేశాడు. రాయుడు గాయపడడంతో కేరళకు చెందిన సంజూ శామ్సన్ కు అవకాశం దక్కింది.