
కష్టాల్లో బెంగళూర్
రాంచీ: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ కష్టాల్లో పడింది. 36 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పది ఓవర్లు ముగిసే సరికి బెంగళూర్ మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రిస్ గేల్(21), దినేష్ కార్తీక్(3)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
అంతకుముందు విరాట్ కోహ్లీ(12), ఏబీ డివిలియర్స్(1) మన్ దీప్ సింగ్ (4)పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.చెన్నై బౌలర్లలో రెండు నె హ్రా వికెట్లు తీయగా, అశ్విన్ కు ఒక వికెట్ లభించింది.