ముంబై లక్ష్యం 168 | RCB set target of 168 runs against Mumbai indians | Sakshi
Sakshi News home page

ముంబై లక్ష్యం 168

Published Tue, May 1 2018 9:42 PM | Last Updated on Tue, May 1 2018 9:42 PM

RCB set target of 168 runs against Mumbai indians - Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ముంబై ఇండియ‍న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను మనన్‌ వోహ్రా-డీకాక్‌లు ఆరంభించారు. వోహ్రా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించగా, డీకాక్‌ నెమ్మదిగా ఆడాడు. జట్టు స్కోరు 38 పరుగుల వద్ద డీకాక్‌(7) తొలి వికెట్‌గా ఔటయ్యాడు.  ఈ తరుణంలో వోహ్రాతో జత కలిసిన మెకల్లమ్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే వోహ్రా(45;31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

ఆ తర్వాత మెకల్లమ్‌-విరాట్‌ కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను నిర్మించే యత్నం చేశారు. ఈ క్రమంలోన 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మెకల్లమ్‌(37;25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో వికెట్‌గా ఔటయ్యారు. కాసేపటికి మన్‌దీప్‌ సింగ్‌(14), కోహ్లి(32), వాషింగ్టన్‌ సుందర్‌(1)లు పెవిలియన్‌ బాటపట్టారు. వీరి ముగ్గుర్నీ ఒకే ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా ఔట్‌ చేసి ఆర్సీబీకి షాకిచ్చాడు.దాంతో ఆర్సీబీ 141 పరుగులకు ఆరు వికెట్లను నష్టపోయింది. ఆ తర్వాత టిమ్‌ సౌతీ(1) ఔట్‌ కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. చివర్లో గ్రాండ్‌ హోమ్‌(23 నాటౌట్‌; 10 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement