బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపును అందుకుంది. ఫలితంగా సొంత మైదానంలో వరుసగా రెండు ఓటముల తర్వాత విజయంతో ఊపిరి పీల్చుకుంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఆద్యంతం తడబాటకు లోనైంది. హార్దిక్ పాండ్యా(50), కృనాల్ పాండ్యా(23),జేపీ డుమినీ(23) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంది. ఆర్సీబీ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, సిరాజ్, సౌథీ తలో రెండు వికెట్లతో గెలుపులో కీలక పాత్ర పోషించారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను మనన్ వోహ్రా-డీకాక్‌లు ఆరంభించారు. వోహ్రా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించగా, డీకాక్ నెమ్మదిగా ఆడాడు. జట్టు స్కోరు 38 పరుగుల వద్ద డీకాక్(7) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ తరుణంలో వోహ్రాతో జత కలిసిన మెకల్లమ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే వోహ్రా(45;31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత మెకల్లమ్-విరాట్ కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను నిర్మించే యత్నం చేశారు. ఈ క్రమంలోన 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మెకల్లమ్(37;25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో వికెట్‌గా ఔటయ్యారు. కాసేపటికి మన్‌దీప్ సింగ్(14), కోహ్లి(32), వాషింగ్టన్ సుందర్(1)లు పెవిలియన్ బాటపట్టారు. వీరి ముగ్గుర్నీ ఒకే ఓవర్‌లో హార్దిక్ పాండ్యా ఔట్ చేసి ఆర్సీబీకి షాకిచ్చాడు.దాంతో ఆర్సీబీ 141 పరుగులకు ఆరు వికెట్లను నష్టపోయింది. ఆ తర్వాత టిమ్ సౌతీ(1) ఔట్ కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. చివర్లో గ్రాండ్ హోమ్(23 నాటౌట్; 10 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment