బెంగళూరు: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. మంగళవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఆర్సీబీ పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన నాల్గో ఓవర్ రెండో బంతికి కీపర్ డీకాక్‌కు ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. రోహిత్ భుజాల కింద నుంచి వెళ్లిన బంతి బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్‌కు ఎడమగా వెళ్లింది. అయితే దాన్ని డీకాక్ అద్భుతంగా అందుకున్నప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు.
దీనిపై డీకాక్ సలహాతో థర్డ్ అంపైర్ నిర్ణయానికి వెళ్లిన కోహ్లి అందులో సక్సెస్ అయ్యాడు. ఆ బంతి రోహిత్ బ్యాట్‌ను తాకినట్లు రిప్లేలో తేలింది. దాంతో రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఫలితంగా ఓవరాల్ ఐపీఎల్‌లో రోహిత్ శర్మ రెండోసారి గోల్డెన్‌గా ఔటైన అప్రతిష్టను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఇదే సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొలిసారి గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు.
కాగా, గతంలో ఒకసారి రోహిత్ డైమండ్ డక్(బంతులేమీ ఆడకుండా రనౌట్ కావడం)గా పెవిలియన్ చేరాడు. 2011లో కేకేఆర్‌తో వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ డైమండ్ డక్‌గా ఔటయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment