
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ చిన్నస‍్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ.. బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఇంకా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ముంబైతో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. కాగా, మురుగన్ అశ్విన్‌ను తప్పించిన ఆర్సీబీ.. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో పొలార్డ్ తిరిగి చేరాడు. ఎవిన్ లూయిస్ స్థానంలో పొలార్డ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఇరు జట్లు ఏడేసి మ్యాచ్‌లు ఆడగా తలో రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందాయి. దాంతో ఇక నుంచి ఆయా జట్లు ఆడే ప‍్రతీ మ్యాచ్ కీలకమే.
తుదిజట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్
విరాట్ కోహ్లి(కెప్టెన్), క్వింటన్ డికాక్, బ్రెండన్ మెకల్లమ్, మనన్ వోహ్రా, మన్‌దీప్ సింగ్, గ్రాండ్ హోమ్, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, యుజ్వెంద్ర చహల్
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జేపీ డుమినీ, కృనాల్ పాండ్యా, బెన్ కట్టింగ్, మిచెల్ మెక్‌గ్లాన్, మయాంక్ మార్కండే, జస్ప్రిత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment