బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా గురువారం ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరుగుల వరద సృష్టించింది. పటిష్టమైన సన్‌రైజర్స్ బౌలింగ్‌పై విరుచుకుపడి 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏబీ డివిలియర్స్(69;39 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్), మొయిన్ అలీ(65;34బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు)లు చెలరేగి ఆడగా, గ్రాండ్ హోమ్ (40; 17 బంతుల్లో1 ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో రాయల్ చాలెంజర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పార్థీవ్ పటేల్, కోహ్లిలు ఆరంభించారు. వీరిద్దరూ స్వల్ప విరామాల్లో పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పార్థీవ్ పటేల్(1) తొలి ఓవర్ ఆఖరి బంతికి పెవిలియన్ చేరగా, ఐదో ఓవర్ ఐదో బంతికి విరాట్ కోహ్లి(12) ఔటయ్యాడు. ఆ తరుణంలో ఏబీ డివిలియర్స్-మొయిన్ అలీల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే రషీద్ ఖాన్ వేసిన 15 ఓవర్లో డివిలియర్స్, మొయిన్ అలీలు పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ 14.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఆపై గ్రాండ్ హోమ్ మెరుపులు మెరిపించగా, సర్ఫరాజ్ ఖాన్(22 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శర్మకు వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment