బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆర్సీబీ ఐదు ఓవర్లలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఓపెనర్లు పార్థీవ్ పటేల్(1), విరాట్ కోహ్లి(12)లు స్వల్ప విరామాల్లో పెవిలియన్‌కు చేరారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో భాగంగా తొలి ఓవర్ ఆఖరి బంతికి పార్థీవ్ ఔట్ కాగా, ఐదో ఓవర్ ఐదో బంతికి కోహ్లి పెవిలియన్ బాట పట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పార్థీవ్ పటేల్, కోహ్లిలు ఆరంభించారు. అయితే మొదటి తొలి బంతికే పార్థీవ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను దీపక్ హుడా వదిలేశాడు. కాగా, అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన పార్థీవ్.. సిద్దార్థ్ కౌల్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. ఆ తరుణంలో కోహ్లికి జత కలిసిన డివిలియర్స్ ఫోర్లతో అలరించాడు. షకిబుల్ హసన్ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఏబీ.. సందీప్ శర్మ బౌలింగ్‌లో కూడా వరుసగా రెండు ఫోర్లు సాధించాడు. అయితే కోహ్లి-డివిలియర్స్‌ల జోడిని సాధ్యమైనంత తొందరగా పెవిలియన్ చేర్చాలనే ఉద్దేశంతో రషీద్ ఖాన్ బౌలింగ్‌కు దింపాడు విలియమ్సన్. ఆ వ్యూహం ఫలించింది. ఐదో ఓవర్ నాల్గో బంతికి ఫోర్ కొట్టిన కోహ్లి.. ఐదో బంతికి మరో షాట్ ఆడే యత్నం చేసి బౌల్డ్ అయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 39 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఇదిలా ఉంచితే, ఈ ఐపీఎల్ సీజన్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో కోహ్లి ఔట్ కావడం ఏడోసారి.
Comments
Please login to add a commentAdd a comment