![Rishabh Pant Named in A Category of BCCI Pay Grade - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/8/rishab.jpg.webp?itok=kNxVrVMK)
ముంబై: ఏడు నెలల క్రితం టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన నాటినుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు బీసీసీఐనుంచి తగిన గుర్తింపు లభించింది. గురువారం సీఓఏ ఖరారు చేసిన 2018–19 వార్షిక కాంట్రాక్టుల్లో పంత్‌కు ‘ఎ’ గ్రేడ్ దక్కింది. బీసీసీఐ గ్రేడింగ్‌లో గత ఏడాదే చేర్చిన ‘ఎ ప్లస్’ గ్రేడ్ అన్నింటికంటే అత్యుత్తమం. రూ. 7 కోట్లు లభించే ఈ జాబితాలో గత ఏడాది ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే వీరిలో మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్‌గా ఉన్న కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలను మాత్రమే ఉంచి ఈ సారి భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్‌లను తప్పించారు.
‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): కోహ్లి, రోహిత్, బుమ్రా
‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, ధోని, ధావన్, షమీ, ఇషాంత్, కుల్దీప్, పంత్
‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): రాహుల్, ఉమేశ్ యాదవ్, చహల్, హార్దిక్ పాండ్యా
‘సి’ గ్రేడ్ (రూ. 1 కోట్లు): జాదవ్, దినేశ్ కార్తీక్, రాయుడు, మనీశ్ పాండే, హనుమ విహారి, ఖలీల్ అహ్మద్, సాహా
Comments
Please login to add a commentAdd a comment