BCC
-
జీసీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 5 సాధించి సత్తా చాటింది. రెండు విభాగాల్లో మొదటి ర్యాంకు, ఒక విభాగంలో రెండో ర్యాంకు, మరో రెండు విభాగాల్లో మూడో ర్యాంకు లభించాయి. ► ప్రతిస్పందన విభాగంలో.. గిరిజనుల కోసం ప్రధానమంత్రి వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల (ఎంఈపీ)కు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను అందించడంలోను దేశంలోనే టాప్‌లో నిలిచి మొదటి ర్యాంకు సాధించింది. ► రిటైల్ అండ్ మార్కెటింగ్ విభాగంలో.. సేంద్రియ, సహజ ఆహార ఉత్పత్తుల సరఫరాలోను జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు గెల్చుకుంది. ► కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4 కోట్ల 50 లక్షల 74 వేల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు దక్కింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.9 కోట్ల 76 లక్షల, 27 వేల విలువైన చిన్న తరహా అటవీ ఫలసాయాలు (ఎంఎఫ్పీ) సేకరించినందుకు జాతీయ స్థాయిలో 3 వ ర్యాంకు సాధించింది. ► 2020–2021లో అత్యధికంగా రూ.12 కోట్ల 86 లక్షల 12 వేలను వినియోగించినందుకు దేశంలోనే 3 వ ర్యాంకు దక్కించుకుంది. సీఎం మార్గనిర్దేశం.. సిబ్బంది అంకితభావంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశం, అధికారులు, సిబ్బంది అంకితభావం వల్లే జీసీసీకి 5 అవార్డులు దక్కాయి. కరోనా కష్టకాలంలోను ఉత్తమ పనితీరుతో జీసీసీ అధికారులు, సిబ్బంది అధికంగా వ్యాపార వ్యవహారాలను నిర్వహించగలిగారు. అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు 2019–20లో రూ.13.18 కోట్లు, 2020–21లో రూ.76.37 కోట్లు ఖర్చుచేశాం. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు 2019–20లో రూ.24.22 కోట్లు జరగ్గా, 2020–21లో రూ.33.07 కోట్లకు పెరిగాయి. 2019–20లో జీసీసీ రూ.368.08 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేయగా, 2020–21లో తీవ్రమైన కరోనా నేపథ్యంలోను రూ.450.68 కోట్ల మేరకు వ్యాపారం చేయగలిగింది. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి జాతీయస్థాయిలో సత్తా చాటింది జాతీయస్థాయి ర్యాంకింగ్ల్లో జీసీసీ సత్తా చాటింది. పలు విభాగాల్లో ఏకంగా 5 జాతీయ అవార్డులు రావడం ఎంతో గర్వకారణం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జీసీసీలు పలు విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు కేంద్ర ట్రైఫెడ్ సంస్థ ఈ అవార్డులను అందిస్తుంది. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల్లోను అటవీ ఉత్పత్తుల సేకరణలో జీసీసీ పటిష్టమైన కార్యాచరణ చేపట్టింది. అటవీ ఉత్పత్తుల అమ్మకాల్లో రాష్ట్రంలోని గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమన్వయం, పర్యవేక్షణతోనే ఇంత గొప్ప రికార్డును సాధించడానికి సాధ్యమైంది. – పీఏ శోభ, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్, విశాఖపట్నం -
రిషభ్ పంత్‌కు ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్
ముంబై: ఏడు నెలల క్రితం టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన నాటినుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు బీసీసీఐనుంచి తగిన గుర్తింపు లభించింది. గురువారం సీఓఏ ఖరారు చేసిన 2018–19 వార్షిక కాంట్రాక్టుల్లో పంత్‌కు ‘ఎ’ గ్రేడ్ దక్కింది. బీసీసీఐ గ్రేడింగ్‌లో గత ఏడాదే చేర్చిన ‘ఎ ప్లస్’ గ్రేడ్ అన్నింటికంటే అత్యుత్తమం. రూ. 7 కోట్లు లభించే ఈ జాబితాలో గత ఏడాది ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే వీరిలో మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఉన్న కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలను మాత్రమే ఉంచి ఈ సారి భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్‌లను తప్పించారు. ‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): కోహ్లి, రోహిత్, బుమ్రా ‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, ధోని, ధావన్, షమీ, ఇషాంత్, కుల్దీప్, పంత్ ‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): రాహుల్, ఉమేశ్ యాదవ్, చహల్, హార్దిక్ పాండ్యా ‘సి’ గ్రేడ్ (రూ. 1 కోట్లు): జాదవ్, దినేశ్ కార్తీక్, రాయుడు, మనీశ్ పాండే, హనుమ విహారి, ఖలీల్ అహ్మద్, సాహా -
చండీలా, షాల భవితవ్యంపై నిర్ణయం వాయిదా
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా తేలిన అజిత్ చండిలా, హికేన్ షాల భవితవ్యం ఈనెల 18వ తేదీన తేలనుంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నేతృత్వంలోని జ్యోతిరాధిత్య సింధియా, నిరంజన్ షాలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ చండీలా, షాలను విచారించి వారి నుంచి రాత పూర్వకంగా స్పందన సేకరించింది. కాగా, ఈ కేసులో మూడో నిందితునిగా ఉన్న పాకిస్తాన్ అంపైర్ అసద్ రాఫ్ విచారణకు హాజరువుకావడానికి కొంత సమయం కోరిన నేపథ్యంలో చండీలా, షాలకు సంబంధించిన నిర్ణయాన్ని జనవరి 18కు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ తాజాగా పేర్కొంది. ఈ మేరకు క్రమశిక్షణా కమిటీ సోమవారం మరోసారి సమావేశమయ్యింది. అప్పట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన 15 మంది ఫిక్సింగ్ బృందం అంపైర్ అసద్ రాఫ్ సాయంతో చండీలా, షాలను కలిశారనేది బీసీసీఐ ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే అసద్ ను మూడో నిందితునిగా చేర్చిన బీసీసీఐ అతనికి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించడానికి అసద్ కొంత సమయం కోరడంతో చంఢీలా, షాల భవిష్యత్తుపై నిర్ఱయాన్ని కూడా మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. -
మోడియే గెలుస్తాడని తెలుసు
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిందెవరో సుప్రీం కోర్టు ప్రకటించకముందే బీసీసీఐ చెప్పేసింది. బోర్డు నుంచి జీవితకాల బహిష్కరణ ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడియే విజేత అని స్పష్టం చేసింది. మొత్తం 33 ఓట్లలో 26 ఓట్లు మోడికే పడినట్టు చెప్పింది. అయితే అధికారికంగా ఈ ఫలితాలున్న సీల్డ్ కవర్‌ను తెరవకూడదని... అంతకన్నా ముందు తమ వాదనలు వినాలని కోర్టులో గట్టిగా వాదించింది. దీంతో తదుపరి విచారణ, ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ‘ఆర్సీఏ అధ్యక్షుడిగా గెలిచేదెవరో మాకు తెలుసు. 33 ఓట్లలో 26 ఓట్లు లలిత్ మోడికి మద్దతుగా ఉన్నాయి. కాబట్టి అతడే విజేత. అయితే అతడు జీవిత కాల బహిష్కరణ ఎదుర్కొంటున్నాడు. పోటీ చేసే అర్హతే తనకు లేదు. ఒకవేళ మోడి ఆర్సీఏ అధ్యక్షుడిగా నెగ్గితే మాకు ఆ సంఘాన్ని సస్పెండ్ చేయడం మినహా మరో దారి లేదు. ఒకవేళ అదే జరిగితే భారత జట్టులో ఉన్న రాజస్థాన్ ఆటగాళ్లు వెంటనే చోటు కోల్పోవాల్సి వస్తుంది’ అని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే వాయిదా పడుకుంటూ వస్తున్న ఆర్సీఏ ఎన్నికల ఫలితాలను వాస్తవానికి సోమవారం ప్రకటించాల్సి ఉంది. అయితే బోర్డు దీన్ని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. బీసీసీఐతో పాటు మోడికి వ్యతిరేకంగా పోటీలో నిలిచిన ఆర్పీ శర్మ ఈ ఎన్నికలపై కోర్టులో ఫిర్యాదు చేశారు. అంతకుముందు కోర్టులో ఇరువర్గాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. ఒప్పుకున్నందుకు సంతోషం: మోడి లండన్: ఆర్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో తన విజయం బీసీసీఐకి తెలిసినందుకు సంతోషంగా ఉందని లలిత్ మోడి అన్నారు. అయితే అధికారికంగా ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంపై విచారం వ్యక్తం చేశారు.