టీ 20 ట్రోఫీతో రోహిత్ శర్మ
కేప్‌టౌన్:భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి నాలుగు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి విజయాల్ని అందుకున్న ఎలైట్ కెప్టెన్ల జాబితాలో రోహిత్ స్థానం సంపాదించాడు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన చివరిదైన మూడో టీ 20లో భారత్ విజయం సాధించిన తర్వాత రోహిత్ ఈ ఘనతను సాధించిన ఆరో కెప్టెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు భారత క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి దూరం కావడంతో రోహిత్ సారథిగా వ్యవహరించాడు. అంతకుముందు డిసెంబర్‌లో శ్రీలకంతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు మొదటిసారి రోహిత్ కెప్టెన్‌గా చేశాడు.
ఆ మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసింది. ఆపై సఫారీ గడ్డపై మూడో టీ20లో రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక్కడ కూడా భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించడంతో తొలి నాలుగు టీ 20ల్లో కెప్టెన్‌గా సక్సెస్ అయిన జాబితాలో రోహిత్ చోటు దక్కించుకున్నాడు. ఈ అరుదైన లిస్ట్‌లో రోహిత్ కంటే ముందు మిస్బావుల్ హక్, సంగక్కరా, షాహిద్ ఆఫ్రిది, లసిత్ మలింగా, సర్ఫరాజ్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment